వైరల్: వామ్మో.. అంత భారీ మొసలిని ఆ కొంచిలువ ఎలా మింగేసిందబ్బా..?!

మనిషికైనా, జంతువులుకైనా ఆకలి వేస్తే కడుపు నింపుకోవడానికి ఏదో ఒకటి తింటాయి.జంతువుల సంగతి అయితే చెప్పక్కర్లేదు ఆకలి బాధ తట్టుకోలేక సాటి జంతువులను వేటాడడం ప్రారంభిస్తాయి.

 Viral Vammo How Did That Little Crocodile Swallow Such A Huge Crocodile-TeluguStop.com

ఈ క్రమంలో ఎదుటి జంతువు తనకి సమ ఉజ్జినా కదా అనే విషయం పక్కన పెట్టి మరి కడుపు నింపుకోవడానికి ప్రయత్నిస్తాయి.అయితే ఈ క్రమంలోనే రెండు భారీ జీవుల మధ్య భయంకర యుద్ధం జరిగిందనే చెప్పాలి.

అయితే యుద్ధం అనేది జరిగితే గెలుపు ఒక్కళ్లకే సాధ్యం అవుతుంది కావున ఆ రెండు జీవుల్లో ఒకటి మాత్రమే ప్రాణాలతో మిగిలింది.మరోకటి బతికి ఉన్నా జంతువుకు ఆహారంగా మారిపోయింది.

 Viral Vammo How Did That Little Crocodile Swallow Such A Huge Crocodile-వైరల్: వామ్మో.. అంత భారీ మొసలిని ఆ కొంచిలువ ఎలా మింగేసిందబ్బా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ ఆ జీవులు ఏంటో ఒకసారి చూద్దామా.

మీ అందరికి కొండ చిలువ గురించి తెలిసే ఉంటుంది.

ఎదుట ఉన్న జంతువు ఎంత పెద్దది అయినాగానీ అమాంతం దాన్ని చుట్టేసి మింగేస్తుంది కదా.అలాగే నీటిలో ఉండే మొసలికి వెయ్యి ఏనుగుల బలం ఉంటుంది అనే విషయం మనకి తెలిసిందే.అయితే ఈ జీవులు రెండు ఒకదానికి ఒకటి ఎదురయితే వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోండి.అయితే ఈ రెండు జీవులు పోరాడుకునే దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఇంతకి ఈ ఫోటోలు ఎక్కడ లభ్యం అయ్యాయంటే.ఆస్ట్రేలియా లోని క్వీన్స్‌ల్యాండ్‌ లోని ఈసా పర్వత ప్రాంతంలో కనిపించాయి.

కయకెర్ మార్టిన్ అనే వ్యక్తి ఆ పర్వత ప్రాతంలో తిరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న ఒక నదీ తీరంలో మొసలి, కొండ చిలువలు రెండు బీకర పోరాటం చేసుకుంటున్న సమయంలో మార్టిన్ వాటిని చూసి ఫోటోలు తీశాడు.ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Telugu Crocodile, Eaten, Phyton, Social Media, Viral, Viral Latest, Viral News-Latest News - Telugu

ఈ ఫోటోలను ఒకసారి పరిశీలిస్తే.ఒక కొండ చిలువ ఎంతో ఆకలితో ఉన్నట్టు ఉంది.ఏ జంతువు తారస పడుతుందా.దాన్ని మింగేద్దామా అని చూస్తున్న కొండచిలువకు ఒక నది ఒడ్డున మొసలి కనిపించింది.దాన్ని చూసిన కొండచిలువ మొసలిని కదలకుండా గట్టిగా చుట్టేసింది.అయితే ఆ నది తీరంలో నీళ్లు ఎక్కువగా లేకపోవడంతో మొసలి బలం చూపించలేక పోయింది.

అక్కడికి మొసలి ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎంతగానో ప్రయత్నం చేసింది.కానీ.

కొండచిలువ పట్టుకి మొసలి ఊపిరాడక చనిపోయింది.తరువాత మొసలిని మింగేసింది కొండచిలువ.

అయితే ఈ ఫొటోలను గత ఏడాదే ‘సీజీ వైల్డ్ లైఫ్ రెస్క్యూ’ అనే సంస్థ తమ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది.కాకపోతే ఇప్పుడు ఈ ఫోటోలు ఇంకోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

#Eaten #Crocodile #Phyton

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు