వైరల్: అదికారులను అభ్యర్ధన చేసుకున్న కేంద్ర మంత్రి..!

దేశంలో కరోనా సెకండ్ వే విజృంభణ కొనసాగుతుంది.రోజురోజుకు ఈ మహమ్మారి బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.

 Union Minister,  Viral News, Viral Latest, Social Media, Vk Singh, Carona Bed, H-TeluguStop.com

ఇక కరోనా బాధితులు ఆసుపత్రిలో బెడ్స్ దొరికాక చాలా పాట్లు పడుతున్నారు.ఇక కరోనా బారిన పడిన తమవారిని ఆదుకునేందుకు సాక్షాత్తూ కేంద్ర మంత్రి ఒకరు ఎలా ప్రయత్నిస్తున్నారో చూపించడానికి నిదర్శనం ఇది.

కేంద్ర మంత్రి వీకే సింగ్ తమ్ముడికి కరోనా వైరస్ సోకింది.అయితే అతడికి ఆసుపత్రిలో బెడ్ దొరకడంలేదు.

దీంతో మంత్రి తన సోదరికి బెడ్ ను కేటాయించడంలో సాయపడాల్సిందిగా ఘజియాబాద్ నియోజకవర్గ అధికారులను కోరారు.ఇక మంత్రి చేసిన ట్వీట్ బట్టే అర్ధం చేసుకోవచ్చు ఈ దేశంలో వైద్య పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేది.

ఇక ఆయన చేసిన ట్వీట్ అపోహలకు దారి తీయవచ్చునని భావించిన ఈయన ఆ తరువాత దాన్ని తొలగించారు.మరల ఆయన ’నా బ్రదర్ ఒకరికి హాస్పిటల్ బెడ్ లభించేలా చూడండి’ అని సింగ్ ఘజియాబాద్ అధికారులను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

ఇక మంత్రి ట్వీట్ చుసిన ట్విటర్ యూజర్లు ఈ ఇండియాలో ఒక మంత్రి సైతం తన బంధువుకు మెడికల్ సాయం కావాలని కోరడం శోచనీయమన్నారు.మన మెడికల్ సిస్టం ఇంత ఘోరంగా ఉందని పేర్కొన్నారు.

ఇదీ మన దేశ వైద్య పరిస్థితి అని సెటైర్ వేశారు.కాగా ఆ వ్యక్తి తన రక్తం పంచుకున్న సోదరుడు కాదని, తన సోదరుని వంటివాడని జనరల్ సింగ్ స్పష్టం చేశారు.

అయితే ఈ ట్వీట్ పై స్పందించిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎన్నికైన ఓ ప్రజా ప్రతినిధి, సాక్షాత్తూ ఒక కేంద్ర మంత్రి నిస్సహాయతను ఈ ట్వీట్ ప్రతిబింబిస్తోందని వ్యాఖ్యానించారు.ఘజియాబాద్ జిల్లా మేజిస్ట్రేటుకు జనరల్ సింగ్ ఓ అభ్యర్థన పంపారని ఈ ఎంపీ పేర్కొన్నారు.దేశంలో మన వైద్య రంగ పరిస్థితి ఇలా ఉందని ఆమె కూడా పరోక్షంగా అభివర్ణించారు.కోవిడ్ సెకండ్ వేవ్ పాండమిక్ ఇంత దారుణంగా ఉందని ప్రజలు నిట్టూరుస్తున్నారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, టీకామందుల ఉత్పత్తి పెంచేలా ఆయా కంపెనీలను ప్రభుత్వం కోరాలని ఆమె ప్రతిపాదించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube