వైరల్: మందు బాటిల్ బిల్లు పోలీసులు అడిగినందుకు ఏకంగా..?!

నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపకోవాలని ఒక విదేశీయుడు ఎంతగానో ముచ్చటపడ్డాడు.కాని పాపం అతని ఆశలు అన్ని అడియాసలు అయిపోయాయి.

 Viral Unanimous For Asking The Police About The Drug Bottle Bill, Viral Latest,-TeluguStop.com

న్యూ ఇయర్ వేడుకలను మందుతో సెలెబ్రేట్ చేసుకుందామని భావించి మద్యం బాటిల్స్ ను తీసుకుని వెళ్తున్న క్రమంలో అతన్ని పోలీసులు అడ్డగించి బాటిళ్లకు సంబంధించిన రసీదు చూపించాలని కోరారు.అయితే అతని దగ్గర మద్యం బాటిల్స్ కు సంబందించిన రసీదులు లేకపోవటం వల్ల పోలీసుల ఆ మందును తీసుకుని వెళ్ళడానికి ఒప్పుకోలేదు.

పోలీసుల మీద కోపంతో ఆ మందును రోడ్డు పక్కన పారబోసి నిరసన తెలిపాడు ఆ విదేశీయుడు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబందించిన వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

వివరాల్లోకి వెళితే.ఈ సంఘటన కేరళ కోవాలంలో చోటు చేసుకుంది.

కేరళ తిరువ నంతపురంలోని కోవాలంలో మద్యం బాటిల్స్ కు రసీదు లేకుండా ప్రయాణిస్తున్న ఒక స్వీడన్ దేశస్థుడును పోలీసులు పట్టుకున్నారు.నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా స్విడెన్ దేశస్థుడు మద్యం బాటిల్స్ తీసుకుని వెళ్తుండగా కోవాలం బీచ్ రోడ్డులో పోలీసులకు చిక్కాడు.

కొనుగోలు చేసిన మద్యం బాటిల్స్ కు రసీదులు చూపించాలని విదేశీయుడ్ని కోరగా అతను తన దగ్గర లేవని, కోవాలంలోని కేరళ అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం షాపులో ఈ బాటిళ్లను కొనుగోలు చేశానని వారికి చెప్పాడు.

పోలీసులు తప్పనిసరిగా రసీదు కావాలని అడగడంతో తన దగ్గర రసీదు లేదని తేల్చి చెప్పేసాడు.

ఆ విధేయుడి పాస్పోర్ట్ చూసిన అధికారులు అతడ్ని స్టిగ్ స్టీఫెన్ యాస్బర్గ్ గా గుర్తించారు. రసీదు చూపించకుండా మద్యాన్ని తీసుకుపోయేదానికి అనుమతించమని పోలీసులు యాస్బర్గ్కు తేల్చి చెప్పారు.

పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ స్టిగ్ స్టీఫెన్ యాస్బర్గ్ తన దగ్గర ఉన్న మద్యం బాటిల్స్ అన్నిట రోడ్డు పక్కన పారబోశాడు స్టీఫెన్.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఘటనపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube