ఇండియా- ఆసీస్ టెస్ట్ జరిగిన తీరు క్రికెట్ చరిత్రలో నిలిచి పోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.క్రీడా స్పూర్తిని ప్రదర్శించాల్సిన ఆసీస్ ఆటగాళ్లు మన భారత ఆటగాళ్లపై ఉపయోగించిన భాష, వ్యవహరించిన తీరుని సీనియర్ క్రికెటర్లు తీవ్రంగా ఖండిస్తున్నారు.
కాని ఆసీస్ ఆటగాళ్ల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మన భారత ఆటగాళ్లు పోరాడి ఆడిన తీరు దేశ ప్రజలు గర్వపడేలా చేసింది.చివరలో మన తెలుగు తేజం హనుమ విహారి చూపిన పోరాట పటిమ దేశ వ్యాప్తంగా, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో హనుమ విహారిపై ప్రశంసల వర్షం కురిసింది.
సినీ హీరో వెంకటేష్, మహేష్ బాబు ఇలా సెలెబ్రెటీలు భారత ప్రదర్శనపై ట్వీట్ చేస్తూ తమ అభినందనలు తెలిపారు.ఇక అసలు విషయంలోకి వెళ్తే ఈ మ్యాచ్ లో హనుమ విహారి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.హైదరాబాదీ అయిన హర్షాభోగ్లే ట్వీట్ వైరల్ గా మారింది.“విజయలక్ష్మి గారు మీ అబ్బాయి చాలా బాగా అడుతున్నాడు” అని తెలుగులో హనుమవిహారి తల్లితో తన ఆనందాన్ని పంచుకున్నాడు.ఇక హనుమ విహారి ఎలా వీరోచితంగా బ్యాటింగ్ చేశాడో.మనం చూశాం.