వైరల్ : రైలుబోగీలా బైక్ కి ట్రాలీ..!

ఈ మధ్య కాలంలో మన మధ్య ఏ చిన్న విషయం జరిగిన దానిని వీడియో లేదా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ప్రపంచం మొత్తం అందరికీ ఇట్లే తెలిసిపోతుంది.ఇదే సమయంలో ఎన్నో వింతలు విశేషాలు జరిగిన సోషల్ మీడియా ద్వారా ప్రపంచం మొత్తం ఇట్లే తెలిసిపోతుంది.

 Viral Trolley To Bike Like Train-TeluguStop.com

ఇందులో కొన్ని విషయాలు మన అందరికీ పనికి వచ్చేవి అయితే కొన్ని మాత్రం కేవలం నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి.మరికొన్ని వీడియోలు జంతువులకు, పక్షులకు సంబంధించి ఉండడం కూడా మనం గమనిస్తూనే ఉంటాం.

ఇక అసలు విషయంలోకి వెళితే.

 Viral Trolley To Bike Like Train-వైరల్ : రైలుబోగీలా బైక్ కి ట్రాలీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం భారత దేశంలో రోజురోజుకీ డీజిల్, పెట్రోల్ ధరలు ఏ రేంజిలో పెరుగుతున్నాయో ప్రత్యేకంగా సగటు మనిషికి చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఓ వ్యక్తి మాత్రం పెట్రోల్ ధరలు పెరిగిన నాకు ఎటువంటి బాధ లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు.దీనికి కారణం అతని ఆలోచన అలాంటిది మరి.కత్తిలాంటి ఐడియా వేసి అందరిని అబ్బుర పరుస్తున్నాడు.అదేమిటంటే తన బైకు ను ఎడ్లబండి లాంటి ఓ భోగిని లింకు చేసుకొని సరికొత్త బైక్ బండిని సృష్టించాడు.

అది ఎలా అంటే రైలు బోగి ఒక లింకు పెట్టి మరో భోగి ని యాడ్ చేసిన విధంగా ఒక స్కూటర్ కు ఒక భోగిని అతడు పెట్టేసాడు.దీంతో అతని కుటుంబం మొత్తం కేవలం ఇద్దరి కోసం ఖర్చయ్యే పెట్రోల్ డబ్బులతోనే కుటుంబం మొత్తం హ్యాపీగా ప్రయాణిస్తున్నారు.

ఇలా మొత్తం బైక్ పై ఇద్దరు కూర్చోగా ట్రాలీలో మొత్తం ఎనిమిది మంది కూర్చుండగా ఆ బైక్ పై ప్రయాణించారు.దీంతో అతని ఆలోచన తో కేవలం ఇద్దరు తో వెళ్లాల్సిన వారు ఏకంగా పది మంది ఏక కాలంలో ప్రయాణించారు.

తాజాగా ఇందుకు సంబంధించి వ్యక్తి బైకు పెట్రోల్ కొట్టించుకోవడం కోసం ఓ పెట్రోల్ బంకు దగ్గర ఆగినప్పుడు గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.సోషల్ మీడియాలో ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ వాట్ ఎన్ ఐడియా సర్జీ అంటూ అతన్ని మెచ్చుకుంటున్నారు.

అయితే మరికొందరు ఇలా ప్రయాణం చేయడం కాస్త ప్రమాదమని కాబట్టి చిన్న పాటి నిర్లక్ష్యం జరిగిన ప్రాణాలు పోతాయని కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది లేకపోతే అనేక అనర్థాలు ఎదుర్కోవల్సి ఉంటుంది.

#Bike #Raiway Trolly #Viral Video #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు