వైరల్: మండిపోతున్న ఎండలకు అలసిన పక్షికి నీటి చెమ్మ దొరికింది... చూడండి ఎంత సంతోషపడిందో!

ఎండాకాలం( Summer) కావడంతో భానుడు చాలా తీవ్రంగా మండిపోతున్నాడు.యావత్ దేశంలో ఎక్కడ చూసినా అదే పరిస్థితి.

 Viral Tired Of The Scorching Sun, A Bird Found A Fountain Of Water See How Happy-TeluguStop.com

ఇక అత్యధిక ఉష్ణోగ్రతలకు కేవలం మనుషులే కాదు, ప్రతీ జీవి దహించుకుపోతోంది.ఓ వైపు ఉక్కపోత, మరోవైపు ఎండ వేడిమిని తట్టుకోలేక అనేక చోట్ల జనాలు వడ దెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇక పశుపక్షాదుల పరిస్థితి అయితే చెప్పాల్సిన పనిలేదు.పక్షులు ఎండల తీవ్రతకు ఎక్కడికక్కడ కుప్పకూలిపోతున్న పరిస్థితి.

వేసవి తాపాన్ని తట్టుకునేందుకు నీరు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతున్నాయి.

తాజాగా దానికి సంబంధించిన బ్యూటీఫుల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఓ హమ్మింగ్ బర్డ్ ( hummingbird )ఎండ వేడిమిని తట్టుకునేందుకు నీటితో ఆడుకోవడం ఇక్కడ గమనించవచ్చు.ఈ క్రమంలో తనను తాను పూర్తిగా తడుపుకుంటూ.

వేసవితాపం నుంచి బయటపడే ప్రయత్నం చేసింది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ ఫౌంటెన్( fountain ) నుంచి ధారగా వాటర్ పైకి తన్నుతుండడం చూడవచ్చు.

ఆ నీటి దారపై ఎగురుతూ, కాసేపు సరదాగా ఆడుకుంది ఆ పక్షి.

ఆ పక్షి అలా నీటి బిందువులపై ఎగురుతూ, ఒక్కో చుక్కను తాగుతూ.ఎంజాయ్ చేస్తుంటే అది ఓ దృశ్య కావ్యంలాగా కనబడుతోంది చూడండి.కొందరు నెటిజన్లు అయితే ఈ దృశ్యం చూడడానికి ఓ పెయింటింగ్ లాగా కనబడుతోంది అని అంటున్నారు.

అయితే, ఈ వీడియో చూడటానికి అందంగా ఉన్నప్పటికీ మండే ఎండలకు వాటి మనుగడ ఎలా సాధ్యం? అనే అనుమానం మనకు కలగక మానదు.ఈ క్రమంలో చాలామంది నెటిజన్లు మీమీ ఇళ్ళదగ్గర తాగడానికి వాటికోసం కొంత నీరుని కేటాయించండి అని సలహాలు ఇస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube