వైరల్: ఈ మొక్క ఎప్పటికి ఎండిపొదట... కారణం ఏమిటంటే..?

ఈ భూమిపై జీవించే ప్రతి జీవరాశికి వయసుతో సంబంధం ఉంటుంది.కొంతకాలం గడిచిన తరువాత ప్రతి జీవికి మరణం అనేది ఉంటుంది.

 Viral This Plant Dries Up Forever What Is The Reason-TeluguStop.com

అలాగే మొక్కలు, జంతువులకు కూడా ఒక వయో పరిమితి అనేది ఉంటుంది.కానీ.

ఈ మొక్కకు మాత్రం అలాంటి వయోపరిమితి లేదు.ఎన్ని ఏళ్లు అయిన ఆ మొక్క మాత్రం చెక్కు చెదరకుండా అలానే జీవిస్తుంది.

 Viral This Plant Dries Up Forever What Is The Reason-వైరల్: ఈ మొక్క ఎప్పటికి ఎండిపొదట… కారణం ఏమిటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొక్కలపై ప్రయోగాలు జరిపే శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ఈ మొక్క వయసు ఎంతో తెలిస్తే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు.ఇంతకీ ఆ మొక్క పేరు ఏంటి అసలు ఎలాంటి వాతావరణంలో ఈ మొక్క బతుకుతుంది అనే వివరాలు చూద్దాం.

ఈ మొక్క పేరు వేల్విచియా.ఈ మొక్క వయసు సుమారుగా కొన్ని వేల సంవత్సరాలు ఉంటాయట.

కరెక్ట్ గా చెప్పాలంటే మనిషి యొక్క 30 తరాలు గడిచినగాని ఈ మొక్క మాత్రం ఎండిపోదట.ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే ఈ మొక్క ఎడారిలో మాత్రమే బతుకుతుంది.

ఎడారి అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.చుక్క నీరు కూడా లభించదు.

అందులోను విపరీతమైన వేడి ప్రాంతం.మరి అలాంటి ప్రాంతాల్లో మాత్రమే ఈ వెల్విచియా మొక్క బతుకుతుంది అంటున్నారు శాస్త్రవేత్తలు.

అలాగే ఈ మొక్కలు సగటు జీవిత కాలం వచ్చి 3000 సంవత్సరాలకు పైగా జీవిస్తాయి.నిజం చెప్పాలంటే ఇది ఒక ఎడారి మొక్క అని అనాలి.

ఎడారిలో ఉండే అతి ఉష్ణ వాతావరణం వలన ఈ మొక్క ఎక్కువకాలం జీవిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.అలాగే రెండు మిలియన్ సంవత్సరాల క్రితం వెల్విచియా మొక్కలో కణ విభజన జరిగిన సమయంలో కొన్ని మార్పులు కారణంగా ఈ మొక్క ఎక్కువ కాలం జీవించగలుగుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

Telugu 1859 Year, Dry, Thirty-generations, Viral Latest, Viral News, Welwitschia Plant-Latest News - Telugu

ఎంత వేడి వాతావరణంను అయిన ఈ మొక్క తట్టుకుని జీవించగలుగుతుంది.ఈ వెల్విచియా మొక్క యొక్క వయస్సును బట్టి చూస్తే భూమిపై ఉన్న మొక్కలలో ఎక్కువ కాలం జీవించే మొక్కగా దీనిని గుర్తించారు.దీనిని మించిన మొక్క మరొకటి లేదు.వెల్విచియా మొక్క దక్షిణ అంగోలా, నమీబియాలో పెరుగుతుంది.ఎందుకంటే అక్కడ గల వాతావరణం ఎక్కువ రోజులు వేడిగా ఉంటుంది కాబట్టి.ఈ ప్రదేశంలో ఉన్నవెల్విచియా మొక్కలలో చాలా వరకు మొక్కలు 3000 సంవత్సరాల క్రితం నాటివేనని శాస్త్రవేత్తలు అంటున్నారు.

న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం1859 సంవత్సరంలో మొక్కల జన్యుశాస్త్రవేత్త ఫ్రెడరిక్ వెల్విచ్ అనే శాస్త్రవేత్త వెల్విచియా మొక్కను గుర్తించారు.

#Welwitschia #Generations

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు