వైరల్: జానపద కళాకారుల దారుణ పరిస్థితిని చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు!

అవును, ఎన్నో జానపద కళలు( Folk arts ) కాలగర్భంలో కలిసిపోయాయి.మరెంతో మంది కళాకారులు సరైన గుర్తింపు లేక, ఆఖరికి కతికపేదరికంలో నేలకొరిగారు.

 Viral This One Video Is Enough To Tell The Terrible Situation Of Folk Artists, V-TeluguStop.com

కళకే అంకితం అయిన వారు తమ కళను భిక్షాటనకు ఉపయోగించడం నేటి సమాజంలో మనసుని కలచివేస్తోంది.ఈ క్రమంలోనే తాజాగా రోడ్డుపై ‘సారంగి’ వాయిస్తున్న ఓ కళాకారుడి వీడియో సోషల్ మీడియాలో అవుతోంది.

భారతదేశంలో( India ) ఎంతోమంది జానపద కళకారులు ఉన్నప్పటికీ వారికి ఆయా రాష్ట్రాల నుంచి సరైన ప్రోత్సాహం లేక నానా అవస్థలు పడుతున్నారు.చాలామంది గాయకులు, నృత్యకారులు వేదికలపై ప్రదర్శనలు ఇవ్వవలసి వస్తోంది.

జీవనోపాధి లేని పక్షంలో ఆఖరికి భిక్షాటన చేయాల్సిన పరిస్థితి.

ఇక తాజాగా హిందుస్థానీ శాస్త్రీయ సంగీత గాయకురాలు అశ్వినీ భిడే దేశ్ ( Ashwini Bhide Desh )తీసిన వీడియో వారి పరిస్థితులకు అద్దం పడుతోందని చెప్పుకోవచ్చు.ఈ వీడియోలో ఓ సంగీత కారుడు రోడ్డుపై సారంగి వాయిస్తూ కనిపించడం మనం గమనించవచ్చు.వీడియో రికార్డింగ్ సమయంలో అశ్వినీ భిడే సారంగికి శ్రావ్యమైన రాగాలను పాడారు.అమిత్ ఆనంద్ బివాల్కర్( Amit Anand Biwalkar ) అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోని షేర్ చేయగా విపరీతంగా ట్రెండ్ అవుతోంది.‘ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు అశ్వినీ భిడే తీసిన వీడియో.సారంగికి తన శ్రావ్యమైన గళాన్ని అందించారు.ఈ వీడియోను మీరందరూ మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి’ అనే శీర్షికతో ఈ వీడియోని షేర్ చేశారు.

కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు అనేకమంది మిక్కిలి ఆవేదన చెందుతున్నారు.దేశంలో ఎంతో ప్రతిభావంతులైన కళాకారులు ఇలాంటి దుస్థితిని ఎదుర్కుంటున్నారని వారు కామెంట్ల రూపంలో బాధపడుతున్నారు.ఆ కళాకారుడికి ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తే అతని కుటుంబానికి ఎంతో ఉపయోగపడుతుందని చాలామంది ఇక్కడ తమ కామెంట్ల రూపంలో అభిప్రాయపడ్డారు.మీరు కూడా ఆ వీడియోని చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube