వైర‌ల్‌.. ఈ కోతి జాకీచాన్‌కు శిష్యురాలిలా ఉందే..

ప్రపంచ వ్యాప్తంగా తన యాక్షన్ సినిమాలతో కీర్తి గడించారు హాలీవుడ్ హీరో జాకీచాన్. ఆయన సినిమాలను సినీ అభిమానులు తప్పకుండా చూస్తుంటారు.

 Viral This Monkey Looks Like A Disciple To Jackie Chan Details, Viral Video, Mon-TeluguStop.com

మార్షల్ ఆర్ట్స్‌లో‌ నిష్ణాతుడైన జాకీచాన్ గురించిన ప్రస్తావన ఇప్పుడు ఎందుకంటే.ఆయన మాదిరిగా ఓ మంకీ డిఫరెంట్ ఫీట్స్ చేస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.ఈ నేపథ్యంలోనే జాకీ చాన్ మాదిరిగా స్టంట్స్ చేస్తున్న సదరు మంకీ జాకీ చాన్ శిష్యురాలేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

జాకీచాన్ తన సినిమాల్లో రెండు బైక్‌లపై చేసే స్టంట్స్ అత్యంత ప్రమాదకరమైనవి.అది మాత్రమే కాకుండా ఎవరూ ఊహించని రీతిలో.

ఊహకు అందని విధంగా జాకీ చాన్ స్టంట్స్ చేయగలడు.అటువంటి ఫీట్‌ను తాజాగా ఓ కోతి చేస్తోంది.

కోతికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది.ఆ వీడియోను చూసి జాకీ చాన్ వద్ద కోతి శిక్షణ తీసుకుందని నెటిజన్లు అంటున్నారు.

ఇక సదరు వైరల్ వీడియో విషయానికొస్తే .కోతి రెండు చెట్ల మధ్యలో నిలబడి ఉంది.

చాలా ఎత్తైన రెండు చెట్లు ఎక్కి మరీ అలా డిఫరెంట్ ఫీట్ చేసింది కోతి.రెండు చెట్ల మధ్యలో ఉండి…కోతి అలా చేయడం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.కోతి అలా చేస్తుండగా ఎవరో వీడియో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అది కాస్తా నెట్టింట వైరలవుతోంది.ఇక ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ‘కుంగ్ ఫు మంకీ’ అని అంటున్నారు.

ఈ వీడియోను చాలా మంది నెటిజన్లు లైక్ చేయడంతో పాటు ఇంకా ట్రెండ్ చేసేందుకుగాను ప్రయత్నిస్తున్నారు.కోతి ఇలా డిఫరెంట్ స్టంట్స్ చేయడం తనకు కొత్త కాదని, అలా ఎప్పటికీ చేస్తూనే ఉంటుందని మరి కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube