సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియో కంటెంట్ జనాలకి అందుబాటులోకి వచ్చింది.ఈ క్రమంలోనే ప్రపంచంలోని ఏ మూలన ఉన్న సంగతి అయినా మనకి ఇట్టే తెలిసిపోతుంది.
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఛేజింగ్ కి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక విషయంలోకి వెళితే… ఓ వ్యక్తి ఆసుపత్రి వద్ద కాలికి గాయంతో తన ఊరికి వెళ్లాలని వెయిట్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో అప్పుడే అక్కడ పార్క్ చేసిన ఓ అంబులెన్స్( ambulance ) వేసుకుని చెక్కేసాడు.అయితే అందరూ అనుకున్నట్టుగా అతను ఇంటికి చేరుకోలేదు.
కాగా అంబులెన్స్‌తో పారిపోతున్న అతడిని పట్టుకునేందుకు పోలీసులు సినిమా స్టైల్ లో చేజ్ చేయాల్సి వచ్చింది.కట్ చేస్తే, ఈ క్రమంలో అంబులెన్స్‌తో కల్వర్టుకు ( culvert )ఢీ కొట్టి ప్రమాదానికి గురైయ్యాడు.

విషయం ఏమంటే… హయత్‌నగర్‌లో 108 వాహనాన్ని( 108 vehicles in Hayatnagar ) ఓ దొంగ ఎత్తుకెళ్ళడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.అంబులెన్స్‌తో అతగాడు విజయవాడ పరారయ్యేందుకు యత్నించాడు.ఈ నేపథ్యంలో చిట్యాల దగ్గర బారికేడ్లను ఢీకొట్టడంతో అసలు హంగామా మొదలైంది.విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు అంబులెన్స్‌ను అడ్డుకునేందుకు వాహనాలను అడ్డుగా పెట్టారు.కానీ ఆ దొంగ ఆగకుండా టోల్‌ప్లాజా దగ్గర వాహనాలను ఢీకొట్టి మరీ పరారైయ్యాడు.మరోవైపు పోలీసులు కూడా తగ్గేదేలే అన్నట్లు టేకుమట్ల మూసీ బ్రిడ్జి దగ్గర మళ్లీ వాహనాలు అడ్డుపెట్టి.
మొత్తానికి పట్టుకున్నారు ఆ దుండగుడిని.

మొత్తం సినీ ఫక్కీలో ఆ దొంగను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా పోలీసులకు గతంలోనూ ఆ దొంగ అంబులెన్స్‌లను ఎత్తుకెళ్లినట్లు తెలిసింది.దాంతో వాడు దొంగ కాదు… గజ దొంగ అని విషయం తెలుసుకున్నారు.
ఇక్కడ ట్విస్ట్ ఏమంటే… ఆ అంబులెన్సుని కొట్టేయడానికి పేషేంట్ అవతారం ఎత్తడం! కాగా ఆ వ్యక్తి ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.హైదరాబాద్ శివారు హయత్ నగర్‌లోని సన్ రైజ్ హాస్పిటల్‌లో కాలు గాయానికి చికిత్స చేయించుకున్నాడు.
అయితే అతను ఖమ్మంకు వెళ్లాలనుకున్నాడు.ఇందుకోసం ఏకంగా అంబులెన్స్‌నే ఎత్తుకెళ్లాడు.