వైరల్: ఈ చేప తినడానికి ఉపయోగపడదట.. ఎందుకంటే?

అప్పుడప్పుడు మనం సముద్రంలో కొన్ని వింత జీవులను, వింత చేపలను చూస్తూ ఉంటాం.వాటిని చూసినప్పుడు కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది.

 Viral This Fish Is Useful To Eat Because-TeluguStop.com

అలాంటి జీవులు, చేపలు సోషల్ మీడియాలో తెగ వైరలై కనిపిస్తుంటాయి.ప్రజలు కూడా ఈ జీవులను చూడటానికి ఎంతో మక్కువ చూపిస్తారు.

అయితే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అరుదైన వింత చేప కనిపించింది.పశ్చిమ బంగ్లా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన ఫిష్ సీడ్‌లో ఈ చేప కనిపించింది.

 Viral This Fish Is Useful To Eat Because-వైరల్: ఈ చేప తినడానికి ఉపయోగపడదట.. ఎందుకంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నలుపు, తెలుపు చారలను కలిగి ఉన్న ఈ చేప సముద్రంలో ఫిషింగ్ వెళ్లే గంగపుత్రుల చేతికి చిక్కింది.

ఈ చేపను సక్కర్ ఫిష్ అంటారని ఏపీ మత్స్యశాఖ అధికారులు తెలిపారు.

గతంలో పి.గన్నవరం మండలం మానేపల్లిలోని పంట కాలువల్లో ఈ చేపలను గుర్తించినట్లు ఆయన తెలిపారు.ఈ చేపలు ఎక్కువగా పశ్చిమ బంగ్లాకు దగ్గర్లో ఎక్కువగా ఉంటాయని, కోల్‌కతా నుంచి వచ్చే ఆక్వాసీడ్‌లో కలిసిపోయి ఆంధ్రాకు వచ్చినట్లు ఉన్నాయని పేర్కొన్నారు.ఈ చేపల వల్ల ఆక్వా రైతులకు ఎంతో నష్టం వస్తుందని, చేపల చెరువులో ఈ చేపలు చేరితే భారీ నష్టం వాటిళ్లుతుందన్నారు.

ఇవి సుమారు 50 అంగుళాల పొడవు పెరుగుతాయని, ఇవి ఎక్కువగా సముద్రం, కాలువల్లో కూడా అరుదుగా కనిపిస్తాయన్నారు.

Telugu Fish, Social Media, Suckker Fish, Suckker Fish In East Godavari, Viral, Viral Latest, Viral News-Latest News - Telugu

ఈ చేపలు చాలా డిఫరెంట్ఇవి తోటి చేపలను, సముద్రంలోని మిగిలిన జీవులను కూడా తినేస్తుంది.ఇంకా చెప్పాలంటే మనుషుల మాంసాన్ని కూడా తినేస్తుంది.ఇది ఒక రకమైన క్యాట్‌ఫిష్ జాతికి చెందినది.

పిరానా వంటి చేపలను పోలీ ఉంటుంది.అయితే ఈ చేపలను మనుషులు తినలేరు.

దీని వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి.అందుకే ఆక్వా రైతులు ఈ చేపలు కనిపిస్తే చాలు వెంటనే చంపేస్తారు.

అలాగే ఈ చేపల వల్ల పర్యావరణానికి హాని ఉంటుందని మత్స్యశాఖ అధికారులు తెలిపారు.

#Suckker Fish #Viral #SuckkerFish #Fish #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు