వైరల్: చిన్న నాటి సంతోషాలు అంటే ఇవే కాబోలు..!

ప్రస్తుతం చిన్నపిల్లల నుండి, పెద్ద వాళ్ళ వరకు ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా స్మార్ట్ ఫోన్లతో బిజీగా గడిపేస్తున్నారు.చిన్న వయసులో ఆటలు, పాటలతో గడపాల్సిన సమయాల్లో కూడా స్మార్ట్ ఫోన్ లో గేమ్లు, ప్రైవేట్ కళాశాలలో తీరికలేని చదువులతో సతమతమవుతున్నారు.

 Viral These Might Be The Childhood Memories, Viral Latest, Viral Latest, News Vi-TeluguStop.com

అయితే ఒక్కప్పుడు చిన్నతనంలో తొక్కుడు బిళ్ళ, అష్టా చెమ్మ, పిల్లి గుంతలు, మట్టిలో ఆడుకోవడం లాంటి ఆటలు ఆడుతూ బాల్యాన్ని గడిపే వాళ్ళు.అప్పటి చిన్ననాటి జ్ఞాపకాలు ఓ మధురమైన స్మృతులు.

మీకు అలాంటి జ్ఞాపకాలు ఉన్నాయా.? అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతుంది.ఈ వీడియో చూస్తే మీ చిన్న నాటి జ్ఞాపకాలు, ఆనందాలు ఒకసారి గుర్తుకు వస్తాయి.

వీడియోలో కొంతమంది చిన్నపిల్లలు వర్షం పడుతుండగా ఒక ఎత్తయిన ప్రదేశం నుంచి కిందకు వెళ్లేందుకు ఉన్న దారిని జారుడు బండిలా ఉపయోగించుకున్నారు.

పై నుండి బురదలో జారుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, వీడియో చూసిన నెటిజన్లు తమ చిన్న నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయని కామెంట్లు పెడుతున్నారు.

మరికొందరు జాగ్రత్తగా ఆడుకోవాలి అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube