వైరల్: వెడ్డింగ్ రింగ్ పోగొట్టుకున్న యువకుడు.. చివరకు..?!  

viral the young man who lost his wedding ring finally Cullercoats ,d SUEZ UK staff ,HWRC, North Shields, the man\'s wedding ring, 10ft rubbish pile , Valentine\'s Day. - Telugu 10ft Rubbish Pile, Cullercoats, Hwrc, North Shields, The Man\\'s Wedding Ring, Valentines Day

జేమ్స్ రాస్ అనే ఒక యూకే వ్యక్తి ప్రేమికుల రోజు నాడే తన భార్య ఎంతో ప్రేమతో పెళ్లి రోజున తన వేలుకు తొడిగిన వెడ్డింగ్ రింగ్ ని పొరపాటున చెత్తబుట్టలో పారేసుకున్నాడు.ఆయన దాదాపు పది అడుగుల ఎత్తు గల చెత్త బుట్ట యొక్క మూత తెరిచే క్రమంలో వెడ్డింగ్ రింగ్ చేతి వేలు నుంచి జారి కింద పడిపోయింది.

TeluguStop.com - Viral The Young Man Who Lost His Wedding Ring Finally

అయితే చెత్త పారోబోస్తున్న సమయంలో బాగా చలి ఉండటంతో జేమ్స్ రాస్ గజగజ వణికిపోయాడు.అందుకే తన వేలు నుంచి ఉంగరం జారిపోయిన విషయాన్ని వెంటనే గమనించలేక పోయాడు.

ఐతే అక్కడి పారిశుద్ధ్య కార్మికులు చెత్తను సేకరించి రీసైకిలింగ్ సైట్ కి తరలించారు.ఈలోగా జేమ్స్ రాస్ తన పెళ్లి ఉంగరం పోయిన విషయాన్ని గ్రహించాడు.

TeluguStop.com - వైరల్: వెడ్డింగ్ రింగ్ పోగొట్టుకున్న యువకుడు.. చివరకు..-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు.ప్రేమికుల రోజున వెడ్డింగ్ రింగ్ పోగొట్టుకొని భార్య వద్దకు వెళ్తే ఎన్ని తిట్లు తిడుతుందోనని చాలా భయపడ్డాడు.ఆ తర్వాత బయటికి వెళ్ళిన అతనికి కార్లను చెక్ చేసే ఒక ఉద్యోగిని కనిపించారు.ఆయన ఆమె వద్దకు వెళ్లి తన గోడును వెళ్లబోసుకున్నాడు.

దీంతో వెంటనే స్పందించిన ఆమె మీరేం బాధపడకండి అని చెప్పి 4 పారిశుద్ధ్య కార్మికులు పిలిచి వెడ్డింగ్ రింగ్ వెతికి తెచ్చి పెట్టాలని కోరింది.

దీనితో వారు రిసైక్లింగ్ సైట్ కి వెళ్లి 10 అడుగుల మేర పేరుకున్న చెత్తలో 20 నిమిషాల పాటు వెతికి వెడ్డింగ్ రింగ్ ని కనుగొనగలిగారు.

అనంతరం జేమ్స్ రాస్ కి తిరిగి ఆ వెడ్డింగ్ ఇచ్చేశారు.దీంతో అతడు బాగా సంతోష పడిపోతూ తన వెడ్డింగ్ రింగ్ ని వెతికి తెచ్చిన పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు తెలిపాడు.

ఈ విషయాన్ని అక్కడి యూకె అధికారులు ఫేసుబుక్ వేదికగా వెల్లడించారు.దీంతో నెటిజన్లు యూకే పారిశుద్ధ్య కార్మికులను తెగ పొగిడేస్తున్నారు.

#TheMan's #Cullercoats #HWRC #Valentines Day #North Shields

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు