వైర‌ల్‌.. కింగ్ కోబ్రాకు గ్లాసులో నీళ్లు తాగించిన మ‌హిళ‌..

పాము పేరు వింటేనే ఆమ‌డ దూరం పరుగులు పెడుతంటాం మ‌నం.అందుకే వాటిని ద‌గ్గ‌ర‌కు కూడా రానివ్వ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతుంటాం.

 Viral The Woman Who Drank Water In A Glass For King Cobra, King Cobra, Viral Vid-TeluguStop.com

కొన్ని సార్లు మ‌న ఇంట్లోకే వ‌స్తే ఇంకేమైనా ఉండా ప్రాణాలు పోయినంత ప‌నైపోతుంది క‌దా.అందుకే వాటికి చాలా దూరంగా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తూ ఉంటాం.

కానీ కొంద‌రైతే ఏమాత్రం భ‌యం లేకుండా పాముల‌ను ప‌ట్టుకుని చేతిలో కూడా ఆడిస్తుంటారు.ఎంత పెద్ద కోబ్రాలు అయినా ఈజీగా ప‌ట్టేసుకుని దానితో ఓ ఆట ఆడుకుంటారు.

ఇలా వారు చేయించే విన్యాసాల‌కు సోష‌ల్ మీడియాలో బాగానే ఆద‌ర‌ణ ఉంటుంది.

అయితే ఇలా పాముల‌ను మ‌చ్చిక చేసుకునే వారిలో కొంద‌రు స‌రదాగా చేస్తే మ‌రి కొంద‌రు మాత్రం వాటిమీద ఉన్న ప్రేమ‌తోనే వాటికి సాయం చేస్తుంటారు.

జంతు ప్రేమికులు అయితే పాములు ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో తెలిసినా కూడా వాటి కోసం తాప‌త్ర‌య ప‌డ‌టం కూడా మ‌నం చూస్తూనే ఉన్నాం.అయితే ఇప్పుడు ఓ పాముకు సంబంధించిన వీడియో చూస్తే మాత్రం ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయ‌మ‌నే చెప్పాలి.

ఎందుకంటే ఈ వీడియోలో ఉన్న‌ది మామూలు పాము కాదు కింగ్ కోబ్రా. ఓ మ‌హిళ దానికి హెల్ప్ కూడా చేసేస్తోంది.

Telugu Cobra, Thirsty Cobra, Animals, Gave Cobra-Latest News - Telugu

ఇంత‌కీ ఇందులో ఏముందంటే ఓ కింగ్ కోబ్రా దాహంతో ఓ ఇంటి ముందుకు వ‌చ్చింది.అస‌లు వాతావరణ మార్పులు జ‌రుగుతున్న కార‌ణంగా సూర్యుడి వేడికి త‌ట్టుకోలేక ఓ పెద్ద కోబ్రా అనుకోకుండా ఓ ఇంటి ముందుకు ఎంట్రీ ఇచ్చింది.ఇక దాన్ని చూసిన ఆ మ‌హిళ దాని అవస్థను అర్థం చేసుకుంది.ఎలాగైనా దానికి హెల్ప్ చేయాల‌ని భావించి ప్రాణాల‌ను కూడా లెక్క చేయ‌కుండా గ్లాస్‌లో నీళ్లు నింపి మ‌రీ ద‌గ్గ‌రుండి దానికి తాగించ‌డాన్ని మ‌నం ఇందులో చూడొచ్ఓచు.

ఇక ఆ కోబ్రా కూడా ఆమెను ఏమీ అన‌కుండా ఇంచక్కా తన దాహార్తిని తీర్చుకోవ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube