వైరల్:ఆ మహిళ ముక్కు పుడకను ధరించిన తెలివి అదుర్స్..!

ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వారి అలంకరణలో ఒక్కొక్క అభిరుచి కలిగి ఉండడం అందరికీ తెలిసిన విషయమే.అందులో ముఖ్యంగా మహిళలకు వారు అలంకరించుకోవడం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Viral The Woman Wearing A Nose Splint Is A Wit Adurs-TeluguStop.com

ఇక ముఖ్యంగా వారి ఇళ్లలో జరిగే శుభకార్యాలకు తప్పకుండా ఆభరణాలు ధరించే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది.అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల అనేక మందికి ఈ అవకాశం సరిగా దొరకట్లేదు అని చెప్పవచ్చు.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మాస్కులు ఉపయోగించడం ద్వారా కనీసం లిప్ స్టిక్ కూడా వేసుకోలేని పరిస్థితి ఉందని చాలామంది వాపోతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం.అయితే పరిస్థితి ఇలా ఉంటే కొందరు మహిళలు మాత్రం దీన్ని ఎలా అధిగమించాలి అన్న విషయంపై దృష్టి సాధిస్తున్నారు.

 Viral The Woman Wearing A Nose Splint Is A Wit Adurs-వైరల్: ఆ మహిళ ముక్కు పుడకను ధరించిన తెలివి అదుర్స్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగానే ముఖ్యంగా ముఖానికి తగిలించుకున్న మాస్క్ లపైనే వారి ఆభరణాలు ఎలా ధరించాలన్న విషయంపై తెగ శ్రద్ధ వహిస్తున్నారు మహిళలు.ఇక అసలు విషయంలోకి వెళితే.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనితాల్ జిల్లాలో ఉన్న గోదాకాల్ ప్రాంతానికి చెందిన మహిళ కవిత జోషి తన మేనకోడలు వివాహానికి హాజరయ్యింది.ఇందులో భాగంగా ఆమె తన హోదాకు తగ్గట్టుగా శరీరం మొత్తం బంగారు ఆభరణాలను ధరించింది.

అయితే ఇందులో పెద్ద విషయం ఏముంది అని అనుకుంటున్నారు కదా ! అయితే, అసలు విషయం ఏమిటంటే కరోనా వైరస్ నేపథ్యంలో ఆవిడ ధరించిన మాస్కు ఏకంగా బంగారు ముక్కుపుడక సైతం పెట్టుకోవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఈ విషయం పై కవిత జోషి మాట్లాడుతూతాను ఇంటికి పెద్దదాన్ని కాబట్టి అందుకు తగ్గట్టుగా తన అలంకరణ ఉండాలని చెబుతూనే, ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ రూల్స్ పాటిస్తే తన అలంకరణ చేసుకోవాలని అనుకున్నట్లు తెలియజేసింది.

ఏదో వెరైటీ గా ఉండేందుకు తాను అలా ధరించలేదని పెళ్ళైన మహిళ తప్పకుండా ముక్కుపుడక ధరించాలన్న ఉద్దేశ్యంతో తాను ఇలా చేశానని తెలిపింది.ఇలా పెద్దగా ఉన్న ముక్కు పుడకలు మాస్క్ లోపల ధరిస్తే నొప్పి కలుగుతుందని భావించి అందుకే దాన్ని పిన్నుతో మాస్క్ బయటే ధరించానని తెలియజేసింది.

ఇలా ధరించడం వల్ల తనకు చాలా సౌకర్యవంతంగా ఉందని అలాగే డ్రింక్స్, ఆహారం తీసుకోవడానికి చాలా సులభంగా ఉందని తెలియజేసింది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

#Mask #Talented Women #CaronaVirus #Nose Pin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు