వైరల్: వారందరికీ ఆ రెస్టారెంట్లో భోజనం ఉచితం.. ఎందుకంటే..?!

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.కరోనా సోకిన వారు వివిధ జాగ్రత్తలు పాటిస్తూ ప్రాణాలను కాపాడుకుంటున్నారు.

 Viral The Two Restaurants Of Gujarat Porbandar Serving Free Food To Covid Patien-TeluguStop.com

మరికొంత మంది ఆక్సిజన్, బెడ్లు లేక, వైద్య వసతులు అందకపోవడం వల్ల ప్రాణాలను విడుస్తున్నారు.ఇలాంటి సమయంలో కొందరు కరోనా పేషెంట్లకు సాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు.

వారిలో మనో ధైర్యాన్ని నింపుతున్నారు.తాజాగా గుజరాత్ పోర్ బందర్‌ జిల్లాలో కరోనా పేషెంట్ల సంఖ్య బాగా పెరిగింది.

కరోనా పేషెంట్లతో అక్కడి ఆస్పత్రులన్నీ నిండిపోయాయి.ఇళ్లలో హోమ్ క్వారంటైన్ అయిన కరోనా పేషెంట్లు కూడా ఎక్కువ మందే ఉన్నారు.

ఇలాంటి సమయంలో చాలా మంది పల్లెల నుంచి పోర్‌బందర్ వచ్చి వైద్య చికిత్స పొందుతున్నారు.అలాంటి వారికి సాయం చేయడానికి రెండు రెస్టారెంట్లు ముందుకు వచ్చాయి.

చికిత్స కోసం వచ్చేవారి ఆకలి తీర్చడానికి రెండు రెస్టారెంట్లు తమ వంతు సాయం చేస్తున్నాయి.కన్సార్ రెస్టారెంట్, శాఫ్రాన్ రెస్టారెంట్లు కరోనా పేషెంట్లకు నాణ్యమైన, అన్ని పోషకాలతో ఉన్న భోజనాన్ని ఉచితంగా ఇస్తున్నాయి.

ఆ రెండు రెస్టారెంట్లు ఇస్తున్న ఆహారంలో రైస్, పప్పు, కూరగాయలు ఇలా అన్నీ కలగలిపి ఉంటున్నాయి.

కన్సార్ రెస్టారెంట్ అయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఉచితంగా ఇస్తోంది.

అలాగే శాఫ్రాన్ రెస్టారెంట్ మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఫ్రీగా ఇస్తోంది.ఈ రెస్టారెంట్లు ఆస్పత్రులకు ఫ్రీగా డెలివరీ చేస్తున్నాయి.అలాగే ఇళ్లకు కూడా ఫ్రీగా డెలివరీ చేస్తున్నాయి.ఎక్కడెక్కడి నుంచో పోర్‌బందర్ వచ్చే వారికి ఆహారం కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదని ఈ రెస్టారెంట్లు ఇలా చేస్తున్నట్లు తెలిపాయి.

రెస్టారెంట్లు చేస్తున్న సేవను చూసి పేషెంట్ల కుటుంబ సభ్యులు, బంధువులూ కన్నీటిపర్యంతమవుతున్నారు.పోర్‌బందర్ ప్రజలు రెస్టారెంట్ నిర్వాహకులను మెచ్చుకుంటున్నారు.

కరోనా ఉన్న అందరికీ ఆహారం ఉచితంగా ఇస్తుండటం చాలా గొప్ప విషయం అని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.నిజంగా ఆ రెండు రెస్టారెంట్లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube