సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ కావడం మనం చూస్తూ ఉంటాం.అయితే, అందులో ఎక్కువగా జంతువులకు( Animals ) సంబంధించినవి ఉండడం గమనార్హం.అందులోనూ… కుక్కలకు సంబందించిన వీడియోలను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం.ఈ క్రమంలోనే ఓ శునకం యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనించవచ్చు.
అయితే ఆ కుక్క( Dog ) అన్ని కుక్కల్లాగా కాదండోయ్.ఒక సెలిబ్రిటీగా మన నెటిజన్లకు పరిచయం అయింది.
దానికి కారణం మీకు తెలియాలంటే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని ఖచ్చితంగా చూడాల్సిందే.
విషయం ఏమంటే ప్రముఖ గాయకుడు, పాటల రచయిత అయినటువంటి ఈద్ షిరన్( Ed sheeeran ) లేటెస్ట్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ ట్రెండ్ అవుతోంది.ఈ వీడియోలో మనోడు మ్యాక్సిన్ అనే పేరుగల కుక్క పిల్లను షేప్ ఆఫ్ యూ సింగర్ బ్యాక్‌ప్యాక్‌లో తన వెంట తీసుకు వెళ్లడం మనం స్పష్టంగా చూడవచ్చు.కాగా ఈ కుక్కపిల్లకు డెడికేట్ చేసిన ఇన్‌స్టాగ్రాం పేజ్‌లో ఈద్ షిరన్ ఈ వీడియోను షేర్ చేయగా ఆ వీడియో కాస్త ఇపుడు మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంటోంది.
ఈ వీడియో చూసిన నెటిజనం, అభిమానులు పెద్ద స్థాయిలో స్పందిస్తున్నారు.లైకులు అయితే ఇక లెక్కేలేదు.దాదాపుగా దానిని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మనం చూడవచ్చు.ఇక కామెంట్లకైతే లెక్కేలేదు ఇక.కొంతమంది నెటిజన్లు ఆ శునకాన్ని ఉద్దేశించి ‘అదృష్టం అంటే నీదేనే శునకమా’ అని కామెంట్స్ చేస్తే, కొంతమంది మాత్రం ‘వీధి కుక్కలు ఏం చేశాయని పాపం దగ్గరికి కూడా రానివ్వరు?’ అని కామెంట్ చేయడం గమనించవచ్చు.