వైరల్: ఈ చేప ధర బంగారం కంటే ఎక్కువట.. అసలు ఆ చేప ఏదంటే..?!

చేపల్లో చాలా రకాలు ఉంటాయి.చేపలు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతుంటారు.

 Viral The Price Of This Fish Is Higher Than Gold What Is The Real Fish, Rarest F-TeluguStop.com

ఆయా చేపల రుచి, పోషక విలువలను బట్టి వాటికి డిమాండ్ ఉంటుంది.మన తెలుగు రాష్ట్రాల్లో పులస చేపకు డిమాండ్ ఎక్కువ ఉంటుందని తెలిసిందే.

దాని రేటు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.పులస చేపను వండే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

దానిని చేయి తిరిగినవారే వండగలరని అంటుంటారు.

జపాన్ ప్రజలు కూడా చేపల్ని చాలా ఇష్టంగా తింటారు.

ముఖ్యంగా సీ-ఫుడ్ అంటే వారికి చాలా ఇష్టమట.వారు చాలా రకాల అరుదైన చేపల్ని తింటుంటారు.

అటువంటి చేపల్లో ఓ చేప మాత్రం చాలా ప్రత్యేకం.ఆ చేప ధరలోనే కాదు దాన్ని ముక్కలుగా కోయడం, దాన్ని వండటం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది.

ఆ ప్రత్యేకమైన చేప పేరు ‘ఈల్ ఫిష్’.ఈ ఈల్ ఫిష్ ను కట్ చేయటం, దాన్ని రకరకాలుగా వండటం అంత సులువైన పని కాదట.

ఈల్ ఫిష్ ను వండటం నేర్చుకోవటానికి సంవత్సరాలు పడుతుందట.ఒక్కో సారి జీవిత కాలం పట్టినా ఆశ్చర్చపోనక్కర్లేదని అంటుంటారు.

ఈ ఫిష్ ను కట్ చేయటం కూడా ఓ ఆర్ట్ అని, దాన్ని కట్ చేయటం సులువైన పని కాదని.ఆ చేపను కట్ చేసే నిపుణులు, వండే షెఫ్ లు చెబుతున్నారు.

ఈ ఈల్ ఫిష్ ల‌ను మంచినీటిలో పెంచుతారు.జపాన్‌ లో ఈ చేప ధర బంగారం ధరతో పోటీపడుతుందట.2018 లోనే ఈ చేప కిలోకు 35 వేల డాలర్ల ధర పలికిందంటే దీని డిమాండ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.రోజులు గడిచేకొద్దీ ఈ ఫిష్ ధర పెరుగుతూనే ఉంది.

జపాన్ లో ఈ చేప ధర బంగారం ధర కూడా ఇంచుమించు స‌మానంగా ఉంటుందట.అక్కడి హోటళ్ళు, రెస్టారెంట్లలో ప్రతి ఏడాది సుమారు 50 టన్నుల ఈల్ చేపలు విక్రయిస్తారట.

తూర్పు ఆసియాలో లభించే ఈ చేపల పిల్లల్ని మంచినీటిలో పెంచుతారు.ఒక ఏడాది తరువాత, అవి అమ్మకానికి మంచి ధర పలుకుతాయి.

1980 తరువాత ఈ చేపల సంఖ్య‌ 75 శాతం తగ్గిపోవడంతో జపాన్‌ లో ఈ చేపలు మంచి ధరకు అమ్ముడవుతున్నాయి.ప్రజలు తమకు అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో ఈ చేప‌ల‌ను ప‌ట్టి.

పెంచి విక్రయిస్తుంటారు.తింటుంటారు.

ఈ చేపల ధర ఎక్కువగా ఉండటానికి మరో కారణం ఏమిటంటే.ఈల్ చేపల్ని పిల్లలుగా ఉన్నప్పుడే పట్టుకుని పెంచాలి.

వాటికి మేతగా చాలా హై ప్రొటీన్స్ ఉండే ఆహారాన్ని వేస్తారు.గోధుమలు, సోయాబీన్, చేప నూనె వంటివి ఆహారంగా ఇస్తారు.

అందుకే ఈ చేపల పెంపకం కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది.

ఈ చేపల్లో ఒక చేపకు జ‌బ్బు పడితే.

అది మిగిలిన చేపలకు కూడా వ్యాపిస్తుంది.ఈల్ ఫిష్ పిల్లలు పెరగడానికి 6 నుండి 12 నెలల సమయం పడుతుంది.

ఆ తరువాత వాటిని పొడవును బట్టి ధరల్ని నిర్ణయిస్తారు.ఆ తరువాత వాటిని అమ్మకానికి పెడతారు.

ఈల్ ఫిష్ నుండి తయారయ్యే కబయాకి అనే వంటకానికి జపాన్ లో చాలా డిమాండ్ ఉంటుంది.దీనికి మంచి పేరు ఉంది.

ఈ చేపతో రకరకాల డిష్ లు తయారుచేసే పద్ధతిని తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పడుతుందని అంటారు.ఈ చేపల్ని కత్తిరించే సరైన పద్ధతిని నేర్చుకోవడానికి సంవత్సరాలు పడతాయట.

ఈ ఈల్‌తో చేసిన గ్రిల్లింగ్ కూడా జపాన్‌ లో చాలా ఖరీదైనది.దాని ధర 91 డాల‌ర్లుగా చెబుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube