వైరల్ : ముద్దిస్తే కేసు మాఫీ చేస్తానన్న పోలీస్.. చివరికి..?!

సౌత్ అమెరికా లోని పెరూ దేశంలో ప్రస్తుతం కరోనా నిబంధనలు కఠినంగా అమలు పరుస్తున్నారు.ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలని.

 Viral The Police Will Forgive The Case If Kissed But In The End, Kiss, America,-TeluguStop.com

ధరించని ప్రజలపై జరిమానా విధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.ఐతే మాలెకాన్ డి లా మెరీనా (మిరాఫ్లోర్స్ బోర్డువాక్) లో డ్యూటీ నిర్వహిస్తున్న పోలీస్ అధికారి కి ఒక మహిళ తారసపడింది.

ఆమె కొవిడ్ -19 నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతోంది.

దీంతో ఆ పోలీస్ అధికారి ఆమెను పిలిచి ఆమె వివరాలు అడిగి తెలుసుకోవడం ప్రారంభించారు.

అలాగే జరిమానా విధించ బోయారు.ఈలోగా ఆ మహిళా పోలీస్ అధికారి కి ముద్దు పెట్టబోయింది.

తనపై ఎటువంటి కేసు పెట్టొద్దని.జరిమానా విధించవద్దని.

కావాలంటే తాను ముద్దు కూడా లంచంగా ఇస్తానని చెప్పుకొచ్చింది.అయితే ఆ పోలీస్ అధికారి మొదట్లో ఆమెకు ఫైన్ వేయాలి అనుకున్నాడు కానీ ఆ తర్వాత తన మనసు మార్చుకుని మాస్క్ ని తొలగించి ఆమెకు ముద్దు ఇచ్చాడు.

Telugu America, Bribe, Corona, Fine, Netizens, Suspended-Latest News - Telugu

ఈ తతంగమంతా సమీపంలో ఉన్న ఒక సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యింది.ఆ ఫుటేజ్ ని లోకల్ ఛానల్ ప్రసారం చేశారు.అది కాస్త వైరల్ అవడంతో ఉన్నత అధికారులు ఈ విషయం తెలుసుకొని ఆ పోలీస్ తీరుపై మండిపడ్డారు.వెంటనే అతడిని విధుల నుంచి తొలగించారు.కరోనా నిబంధనలను అతిక్రమించిన మహిళకు ఫైన్ వేయకుండా ఆ పోలీసు తప్పు చేశాడు.కరోనా నిబంధనలను పాటించకుండా మాస్క్ తీసేసి.

లంచంగా ముద్దుపెట్టుకొని మరో తప్పు చేశాడు.

దీంతో ఇది చాలా సీరియస్ విషయమని.

కరోనా కాలంలో సామాన్య ప్రజలే ఇటువంటి పనులు చేయడం లేదని.అలాంటిది డ్యూటీలో ఉన్న ఒక పోలీసు అధికారి ముద్దు పెట్టి పెద్ద తప్పు చేశాడని పైఅధికారులు మీడియాతో మాట్లాడుతూ తాము ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేశామని వెల్లడించారు.

అలాగే ఈ ఘటన గురించి తదుపరి విచారణ చేస్తున్నామని తెలిపారు.ఏదేమైనా పెరూ పోలీసు ఒక మహిళలను ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube