వైరల్: దొంగకు పుట్టిన రోజు సెలబ్రేట్ చేసిన పోలీసులు.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

ప్రస్తుత రోజుల్లో దొంగతనాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి.దొంగలు విచ్చలవిడిగా ప్రజలను దోచుకుంటున్నారు.

 Viral The Police Made Birthday Celebrations For A Thief-TeluguStop.com

పోలీసులు అప్రమత్తంగా ఉండటం వల్ల చాలా వరకూ వారి కార్యక్రమాలు సాగడం లేదు.దొంగలు దొరికినప్పుడు పోలీసులు వారి నుంచి నిజాలు రాబడుతుంటారు.

ఆ టైంలో సరైన సమాధానాలు చెప్పకపోతే లాఠీలతో కొట్టిమరీ నిజాన్ని రాబడుతుంటారు.ఇక్కడ కూడా ఓ దొంగ దొరికాడు.

 Viral The Police Made Birthday Celebrations For A Thief-వైరల్: దొంగకు పుట్టిన రోజు సెలబ్రేట్ చేసిన పోలీసులు.. అసలు మ్యాటర్ ఏంటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే పోలీసులు అతడిని ఏమీ అనలేదు.జస్ట్ బర్త్ డే పార్టీ చేసుకున్నారంతే.

పోలీసులు ముందుగా కేకులు, కూల్ డ్రింక్సు ఆర్డర్ ఇచ్చారు.ఆ తర్వాత అందరూ ఆ దోంగ చేత కేకును కట్ చేయించారు.

ఆ సమయంలో పోలీసులు బర్త్ డే సాంగ్ కూడా పాడారు.ప్రస్తుతం దీనికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

బ్రెజిల్‌ లోని రియో గ్రాండే డో నార్టే అనే ఏరియాలో పౌలో రోడ్రిగో దాస్ నివెస్ అనే వ్యక్తి బతుకుతున్నాడు.అయితే అతడు దొంగతనాలు చేసి బతికేవాడు.

ఆ ప్రాంతాలల్లో ఏ దొంగతనం చేసినా అది ఆయన చేసినదే అయ్యుంటుంది.అటువంటి ఆయన పార్క్ చేసే కార్లలోని సౌండ్ సిస్టమ్, ఆడియో సామాగ్రిని దొంగిలించి బయట అమ్ముకుని సొమ్ము చేసుకునేవాడు.

ఆవిధంగానే ఓ కారులో కూడా దొంగతనం చేయడంతో ఆ కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో పోలీసులు కారులోని సీసీటీవీని పరిశీలించి దొంగను కనిపెట్టారు.

పౌలో రోడ్రిగో దాస్ నివెస్ దొంగతనం చేసినట్లు తెలుసుకుని ఆయన్ని అరెస్టు చేశారు.

Telugu Birthday Celebration, Birthday Celebrations, Brazil, Police Station, Polices, Theif Birthday, Thief, Viral Latest, Viral News, Viral Police-Latest News - Telugu

ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు తరలించారు.అయితే ఆరోజే ఆ దొంగ పుట్టిన రోజు కావడంతో పోలీసులు వేడుకలు నిర్వహించడం కలకలం రేపింది.బర్త్ డే ఆ కేకును కూడా దొంగ తన తల్లికి సగం పంపించాడు.

ప్రస్తుతం దొంగకు సంబంధించిన వీడీయో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

#Thief #Police Station #Polices #Theif Birthday #Viral Police

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు