ఒక్కోసారి మన అదృష్టం మనమే నమ్మలేని పరిస్థితి కలుగుతుంది.అలాంటి అదృష్టం ఇటీవల ఒక గ్రామంలో ఉన్న ప్రతిఒక్కరికీ జరిగింది.
అది ఒకరికో, ఇద్దరికో కాదు ఆ గ్రామంలో ఉండే జనాభాకు అంతా ఆ అదృష్టం వరించింది.రాత్రికి రాత్రే ఆ ఊర్లో ఉన్న కుటుంబాల వాళ్ళందరూ కోటీశ్వరులు అయ్యారు.
ఇందుకు సంబంధించి అసలు విషయము ఏమిటంటే.
దేశానికి వెన్నుముక రైతులే అని అంటుంటారు.
దేశములో సగానికి మందిపైగా వ్యవసాయం మీదనే ఆధారపడి బతుకుతున్నారు.వీళ్ళ జీవనాధారము అంతా వ్యవసాయమే.
ఈ గ్రామాలకు సరైన రోడ్డు ,బస్సు సౌకర్యాలు సరిగా ఉండవు.కానీ ఇప్పటికీ కొన్ని గ్రామాలు కనీస సౌకర్యాలు లేక ప్రజలు పేదరికంలోనే మగ్గుతున్నారు.
అలాంటి గ్రామ ప్రజలు ఒక్కసారిగా ధనవంతులు అయిపోయారు.అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ జిల్లాలో బొమ్జా అనే ఆ గ్రామంలో ఉండే ప్రజలు ఒక్కరోజులోనే ధనవంతులు అయిపోయారు.
ఆ ఊరి ప్రజలను వరించిన అదృష్టం ఏమిటంటే ఆ గ్రామంలో మొత్తం 31 కుటుంబాలు నివసిస్తున్నాయి.
వీరందరికీ కలిసి 200 ఎకరాల భూమి ఉన్నది.
ఈ రెండు వందల ఎకరాల భూమిని కేంద్ర రక్షణశాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మాణం కోసము తీసుకున్నదని అధికారులు వెల్లడించారు.దీనికి పరిహారంగా రూ.41 కోట్లు ఇచ్చింది.ఈ భూమిని తీసుకున్నందుకు ఆ గ్రామంలోని కుటుంబాలకు పరిహారంగా అధికారిక లెక్కల ప్రకారము ఒక్కో కుటుంబానికి గరిష్టంగా 6.73 కోట్లు చెల్లించినది.అలా పరిహారాన్ని అందుకున్న కుటుంబాలు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యరు.
కానీ గవర్నమెంటు అంత పరిహారము ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం.ఏమైతేనేమి ఆ వూరిలో కుటుంబాలు ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు అయ్యారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఆ భూములలో ప్రాజెక్టు నిర్మించడం వల్ల కొన్ని వేల ఎకరాలకు నీటి వసతి కల్పించబడింది.