వైరల్... ఏకంగా కూతురునే ఇంటి అద్దె కట్టమన్న తల్లి... ఎందుకో తెలిస్తే?

మనం సాధారణంగా బయట ఇంటి అద్దె ఎవరి నుండి తీసుకుంటారు, ఎవరైనా బయటి వాళ్ళు ఇంట్లో ఉండడానికి వచ్చిన వాళ్ళకు అద్దె తీసుకుంటాం.ఇది మామూలుగా ప్రతి చోట జరిగే ప్రక్రియ.

 Viral  The Mother Who Rents The House To Her Daughter Alone If You Know Why , Vi-TeluguStop.com

ఎందుకంటే తమకు సంబంధించిన వాళ్ళ దగ్గర మనం అద్దె తీసుకుంటే అది ఎంత పెద్ద వివాదానికి దారి తీస్తుందనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.  ఎందుకంటే మన సంపద పట్ల మన వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది కావున వాళ్ళ దగ్గర మనం అద్దె తీసుకోకూడదు.

కానీ ఓ తల్లి తన ఇంట్లో ఉన్నందుకు తన బిడ్డ దగ్గర అద్దె తీసుకుంది.అవును తన స్వంత బిడ్డ దగ్గర ఇంటి అద్దె తీసుకోవడం ఏంటని ఆశ్చర్య పోతున్నారా.

అవును ఇది అక్షరాలా నిజం.

అసలు విషయంలోకి వెళ్తే ఈ ఘటన న్యూజిలాండ్ లో జరిగింది.

అయితే తన బిడ్డ దగ్గర ఇంటి అద్దె తీసుకోవడానికి ఒక బలమైన కారణం ఉందని ఆ తల్లి చెబుతోంది.క్యాట్ క్లార్క్ అనే మహిళ తన బిడ్డ దగ్గర ప్రతి నెల అద్దె ఎందుకు వసూలు చేస్తుందో ఇంస్టాగ్రామ్ లో వీడియో ద్వారా తెలిపింది,.

నేను, నా బిడ్డ కలసి ఆడిన ఓ గేమ్ లో తాను ఓడిందని ఒడితే రెంట్ ఇవ్వాలంటూ కండిషన్ పెట్టానని, ఆ కండిషన్ ప్రకారం ఇంటి అద్దె తీసుకుంటున్నానని ఈ విషయంలో ఎవరు ఏమి అనుకున్నా తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, అయితే ప్రస్తుతం నేను తీసుకుంటున్న అద్దెను తాను ఇల్లు కొనుక్కునే సమయంలో సహాయం చేస్తానని ఆ తల్లి చెబుతోంది.అయితే తల్లి చెప్పిన ఈ కారణంతో నెటిజన్లు కూడా సంతృప్తి చెందారని మనం చెప్పవచ్చు.

అయితే ఈ వార్త నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube