వైరల్: తల్లి గర్భంలో ఉన్న శిశువుకు గర్భం..?!

ఈ ప్రపంచంలో మనకు తెలియని వింతలు, విచిత్రాలు ఎన్నో ఉన్నాయి.ఎక్కడో ఒకచోట ఏదో ఒక వింత అనేది జరుగుతూనే ఉంటుంది.

 Viral The Mother Is Pregnant With The Unborn Baby-TeluguStop.com

అయితే మనకి కొన్ని తెలుస్తాయి.మరి కొన్ని తెలియవు.

ఆ వింతలు తెలిసిన తరువాత మనం ఒక్క క్షణం పాటు ఆశ్చర్యంలో ఉండిపోతాము.అయితే అలాంటి ఒక ఆశ్చర్యకరమైన వింత ఒకటి తాజాగా వెలుగు చూసింది.

 Viral The Mother Is Pregnant With The Unborn Baby-వైరల్: తల్లి గర్భంలో ఉన్న శిశువుకు గర్భం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ వింత గురించి తెలిస్తే మీరు కూడా షాక్ అవ్వడం గ్యారంటీ.వైద్య రంగమే ఆశ్చర్యపోయే ఘటన ఒకటి జరిగింది.

అదేంటంటే ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే తల్లి పాత్ర ఎంత ఉందో తండ్రి పాత్ర కూడా అంతే ఉంది అనడంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి.బిడ్డను నవమాసాలు మోసి ఈ భూ ప్రపంచానికి పరిచయం చేస్తుంది అమ్మ.

అయితే ఇప్పుడు ఒక మహిళ కడుపులో ఉన్న ఆడ శిశువు తల్లి గర్భంలో ఉండగానే గర్భం దాల్చింది.ఏంటి.

ఆ పసిపాప ఎలా తల్లి గర్భంలో ఉండగానే గర్భం దాల్చింది అని అనుకుంటున్నారా.ఈ విషయం తెలిసి మనమే ఇంత ఆశ్చర్య పోతున్నామంటే ఇంకా డాక్టర్స్ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి.

విషయం తెలిసి డాక్టర్లు ఆశ్చర్యానికి గురి అయ్యారట.ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఏంటో అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ విచిత్రమైన ఘటన ఇజ్రాయిల్ దేశంలో జరిగింది.అక్కడ ఉన్న అష్ దొడ్ పట్టణంలోని ఒక హాస్పిటల్ లో ఈ నెల మొదటి వారంలో ఒక మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

అయితే బిడ్డను కనే సమయానికంటే ముందే ఆ గర్భిణికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయగా గర్భంలో ఉన్న ఆడ శిశువు పొట్ట భాగం ఎక్కువగా ఉండడాన్ని వైద్యులు కనుకొన్నారు.

Telugu Docters, Pregnant, Social Media, Viral Latest, Viral News, Women-Latest News - Telugu

ఈ క్రమంలో ఆ మహిళ ఆడశిశువును కన్న తరువాత ఆ నవజాత శిశువు పొట్ట భాగం పెద్దగా ఎందుకు ఉందో అని అల్ట్రాసౌండ్ స్కానింగ్ అండ్ ఎక్స్ రే పరీక్షలు జరిపగా ఒక వింత న్యూస్ తెలిసింది.అదేంటంటే ఆ ఆడశిశువు కడుపులో ఒకటి కన్నా ఎక్కువ పిండాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.ఆ తరువాత సర్జరీ చేసి కడుపులో ఉన్న పిండాలను తొలగించారు.

ప్రస్తుతానికి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగానే ఉన్నారు.ఇలా జరగడానికి కారణాలు ఏంటో ఇంకా వైద్యులు వెల్లడించలేదు.

ఈ పసిపాప గర్భం గురించి తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

#Pregnant #Social Media #Women #Docters

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు