వైరల్: ఆ ఊరిలో ఉన్న పురుషులకు ఇద్దరు భార్యలట.. ఎందుకంటే..?!

ఒక్క మగాడికి ఓ భార్య దొరకడమే గగనమైన ఈ కాలంలో కూడా భారతదేశంలోని ఒక గ్రామంలో ప్రతి పురుషుడు ఇద్దరు మహిళలను చేసుకుంటున్నాడు.వాస్తవమేమిటంటే ఆ గ్రామంలోని పురుషులు ఖచ్చితంగా ఇద్దరు యువతులను పెళ్లి చేసుకోవాలట.

 Village, Mens, Two Wifes, Two Marraiages, Cinima,rajasthan,child,dherasar,600 Pe-TeluguStop.com

అది తమ గ్రామ ఆచారం మాత్రమే కాదు అవసరం కూడా అని చెబుతున్నారు ఆ ఊరి ప్రజలు.సంసారం ఒక చదరంగం అంటారు కదా.ఒక భార్యతోనే వైవాహిక జీవితాన్ని సాగించలేక పురుషులు నానా కష్టాలు పడుతున్నారు.అటువంటిది ఆ గ్రామాల ప్రజలు మాత్రం ఇద్దరు భార్యలతో పిల్లల్ని కని వారిని కూడా పోషిస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు.

నిజానికి ఏ భర్త అయిన తన మొదటి భార్య బతికుండగానే మరొక యువతిని పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం.రెండు పెళ్లిళ్లు దేశంలోని ఏ ప్రాంతంలో చేసుకున్నా చట్టరీత్యా నేరమే కానీ రాజస్థాన్ లోని దెరాసర్ అనే ఒక గ్రామంలో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అనేది ఆచారం.

ఈ గ్రామంలో మొత్తం 600 మంది ఉంటే.వారిలో పురుషుల కంటే ఎక్కువగా మహిళలే ఉన్నారు.అందుకే ఇక్కడి పురుషులు ఇద్దరు యువతులను పెళ్లి చేసుకున్నా ఎటువంటి సమస్యలు రావడం లేదు.అయితే మహిళలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి పురుషులు రెండు పెళ్లిళ్లు చేసుకోవడం లేదు కానీ పిల్లల కోసం మాత్రమే ఇద్దరిని పెళ్లి చేసుకుంటున్నారు.

Telugu Cinima, Marraiages, Wifes-Latest News - Telugu

ఎందుకంటే అక్కడి పురుషులు మొదటి భార్యతో పిల్లలను కనాలని ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా.అది సాధ్యం కాదట.పురుషులు తమ మొదటి భార్యతో సంసారం చేసినా.పిల్లలు పుట్టడం అనేది ఆ గ్రామంలో ఇప్పటి వరకు జరగలేదట.కానీ రెండవ భార్య ని పెళ్లి చేసుకొని ఆమెతో సంసారం చేసిన వెంటనే సంతాన సాఫల్యం కలుగుతుంది.ఆ తర్వాత మొదటి భార్య కూడా పిల్లలను కనే శక్తిని పొందుతుంది.

అందుకే మొదటి భార్యతో పిల్లలు కనలేక రెండవ పెళ్లి చేసుకుని ఆమెతో పిల్లలు కని ఆ తర్వాత మొదటి భార్యతో కూడా పిల్లలు కంటారు.ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు సినిమాల కథలాగా ఇక్కడి పురుషుల జీవితాలు ఉండటం మిగతా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube