వైర‌ల్‌.. చ‌నిపోతున్న కోతికి ప్రాణం పోసిన వ్య‌క్తి..

నేటి రోజుల్లో ప్రజలు సాయం అనే మాటే మర్చిపోయారు.ఎవరి బిజీ లైఫ్ లో వారు గడుపుతున్నారు.

 Viral The Man Who Gave Life To The Dying Monkey Details, Viral Video, Monkey , D-TeluguStop.com

మనం వెళ్లేటపుడు రోడ్డు మీద ఎవరైనా సాయం కోసం అభ్యర్థించినా కానీ పట్టించుకోకుండా తయారయ్యారు.అటువంటిది ఓ వ్యక్తి మాత్రం నోరు లేని కోతిపిల్లను ప్రాణాపాయం నుంచి కాపాడాడు.

ఆ వ్యక్తి చేసిన పనికి సెలబ్రెటీల నుంచి సామాన్య నెటిజన్ల వరకూ అందరూ ఫిదా అవుతున్నారు.తమిళ స్టార్ హీరో సూర్య సైతం అతడు చేసిన పనికి నమస్కరించాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే….

కునామ్ కు చెందిన డ్రైవర్ ప్రభు అనే వ్యక్తి బైక్ పై వెళ్తున్నాడు.

ఇలా వెళ్లే దారిలో ప్రభుకు తీవ్ర గాయాలతో అక్కడ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కోతి పిల్ల ఒకటి కనిపించింది.మామూలు మానవులైతే హే.మనకేంటి అని వెళ్లిపోయేవారే.కానీ ప్రభు మాత్రం అలా చేయలేదు.

ఆ కోతికి తీవ్ర సేవలు సపర్యలు చేశాడు.ఆ కోతి కోలుకునేలా చేశాడు.

ఈ క్రమంలో కోతికి శ్వాస అందించేందుకు తన నోటిని కోతి నోటిలో పెట్టి ఆక్సిజన్ అందించాడు.

అటు తర్వాత ఆ కోతిని దగ్గర్లోని జంతువుల హాస్పిటల్ కు తీసుకెళ్లగా అక్కడ ఉన్న డాక్టర్లు ఆ కోతికి తగిన చికిత్స చేసి ఆ కోతిని ఫారెస్టు అధికారులకు అప్పగించారు.ఇలా మూగ జీవైన కోతికి హెల్ప్ చేసిన ఆ వ్యక్తిని ప్రతి ఒక్కరూ పొగుడుతున్నారు.రియల్ ఆపద్భాందవుడు అంటూ పొగుడుతున్నారు.

ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుధా రమేన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.తమిళ స్టార్ హీరో సూర్య ఈ ట్వీట్ కు రిట్వీట్ చేస్తూ ఆ వ్యక్తికి నమస్కారాలు తెలిపాడు.

ప్రభు నిజంగా ఎంతైనా గ్రేట్ కదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube