వైరల్: సింహం సింగిల్‌గానే వచ్చింది... కానీ కుక్కలే గుంపుగా వచ్చి?

సింహం( lion ) సింగిల్‌గానే వస్తుంది అనే డైలాగు మనం దశాబ్దకాలం నుండి వింటూ వున్నాం.ఈ మాటను మనుషులు.

 Viral The Lion Came As A Single But The Dogs Came In A Group ,lion Attack , Vira-TeluguStop.com

మరీ ముఖ్యంగా రాజకీయ ప్రముఖులు అనేవారు ఎక్కడ బడితే అక్కడ విరివిగా వాడడం ఈ మధ్య కాలంలో చూస్తూ వున్నాం.అయితే ఇందులో నిజమెంతో తెలియదు గాని, పవర్ వున్నవారు మాత్రం సింహం మాదిరి ఫీల్ అయిపోయే పరిస్థితి ఇపుడు వుంది.

అదంతా అప్రస్తుతం అనుకోకండి, ఇపుడు ఇక్కడ చెప్పుకోబోయే విషయం తెలిస్తే అవాక్కయే పరిస్థితి వుంది.

ఇక్కడ వీడియోని గమనిస్తే… అక్కడికి సడెన్ గా మృగరాజు ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు గాని, అది విధుల్లో ఒంటరిగా సంచరిస్తుండడం చూడవచ్చు.

అదే సమయంలో అక్కడ ఓ కుక్కను చూసిన సింహం దానిమీదకు ఉరకడానికి చూసింది.అయితే ఆ వెంటనే రెండు మూడు కుక్కలను ఒకేసారి చూసిన సింహం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి.

అవును, కుక్కలు మందగా ఉన్నప్పుడు వాటిని ఎవరూ ఎదిరించలేరు.అందుకే కుక్కలు( dogs ) గుంపులుగా వస్తాయని, సింహాలు ఎప్పుడూ సింగిల్‌గానే వస్తాయని జనాలు చెబుతూ ఉంటారేమో.

ఈ ఘటన గుజరాత్‌( Gujarat )లోని ఓ గ్రామంలో జరిగినట్లు తెలుస్తోంది.రాత్రి వేళ ఆహారం వెతుక్కుంటూ అక్కడికి వెళ్లిన సింహానికి కుక్కలు చుక్కలు చూపించడం ఈ వీడియోలో చూడవచ్చు.ఈ ఘటన మొత్తాన్ని ఎవరో కెమెరాలో బంధించగా వెలుగు చూసింది.ట్విట్టర్‌ వేదికగా మార్చి 22 న అజయ్ చౌహన్41 అనే వినియోగదారుడు దీనిని పోస్ట్ చేయడం జరిగింది.అంతేకాకుండా అతగాడు క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు.‘సింహాన్ని కుక్కలు వెంబడించడం ఎపుడైనా చూసారా?’ అంటూ టెక్స్ట్ యాడ్ చేసాడు.సింగిల్ గా వచ్చిన సింహాన్ని గ్రామ సింహలు ఎలా తరిమికొట్టాయో తెలిసి స్థానికులు కూడా ఆనందం వ్యక్తం చేసారు.కాగా అక్కడి వాళ్లకు కూడా ఆ సింహం ఏం హాని తలపెట్టకుండా వెళ్లిపోయిందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube