వైరల్: వాలెంటైన్స్ డే పురస్కరించుకుని భార్యకు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన భర్త.. కానీ చివరికి..?!

ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు ప్రపంచంలోని ప్రేమికులు తెగ సంబరాలు చేసుకోవడం మనం గమనిస్తూనే ఉంటాం.తాజాగా జరిగిన ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచంలోని ఎంతోమంది ప్రేమికులు ఆ రోజు కానుకగా పువ్వులు, ఇంకా చాక్లెట్ ఇలా అనేక రకాల గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఆ రోజును సంబరాలు జరుపుకున్నారు.

 Viral-the Husband Who Gave A Costly Gift To His Wife On Valentines Day But In Th-TeluguStop.com

అయితే తాజాగా వచ్చిన ప్రేమికుల రోజున పురస్కరించుకొని దక్షిణాఫ్రికా దేశంలో ఓ వేటగాడు తన భార్యకు ఏకంగా జిరాఫీ గుండె ను బహుమతిగా అందజేసి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

దక్షిణాఫ్రికాకు చెందిన  మెరెలైజ్ వాన్ డెర్ మెర్వే అనే మహిళ చనిపోయిన జిరాఫీ హృదయాన్ని పట్టుకొని ఓ ఫోటోను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది.ఈ ఫోటోని ఉద్దేశించి తన వాలెంటైన్ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తనకి జిరాఫీ గుండెను ఇచ్చాడని తెలిపింది.

ఆ జంతువును చంపడానికి తన భర్త ఏకంగా ఒక లక్ష రూపాయలను చెల్లించాడని చెప్పుకొచ్చింది.అయితే ఈ పోస్ట్ పెట్టి పెట్టగానే ఆ పోస్ట్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆవిడ ఆ పోస్ట్ ని తొలగించింది.

నిజానికి జిరాఫీ ఎంత పెద్దగా ఉంటుందో మనకు తెలిసిందే.అదే ఆ జిరాఫీ గుండె కూడా ఎంత పెద్దదో ఉంటుందో ఆలోచించవచ్చు.

అంత పెద్ద గుండె తనకి వాలెంటైన్ గిఫ్ట్ గా ఇచ్చినందుకు తాను కచ్చితంగా చంద్రునిపై ఉన్నానని ఫీల్ అవుతున్నాను అంటూ ఆవిడ ఆ పోస్టులో తెలిపింది.అంతేకాదు ఆ చనిపోయిన జిరాఫీ చర్మాన్ని తాను పడుకునే సమయంలో రగ్గుగా ఉపయోగించాలని అనుకుంటున్నట్లు ఆవిడ తెలిపింది.

దీంతో ఆవిడ పై సోషల్ మీడియాలో జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ దంపతులు ఇప్పటివరకు ఆ ప్రాంతాలలో 500 జంతువులకు పైగా హతమార్చినట్లు అటవీ అధికారులు తెలుపుతున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube