వైరల్: వింత జంతువుకు జన్మనిచ్చిన మేక..!

ఎప్పుడో బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలోని చాలా సంఘటనలు ఈ యుగంలో జరగడం మనం చూస్తూనే ఉన్నాము.మనిషికి జంతువు పుట్టడం, జంతువుకి మనిషి పుట్టడం లాంటివి.

 Viral The Goat That Gave Birth To The Strange Animal, Viral Latest, Viral News,-TeluguStop.com

అయితే జంతువులు, మనిషులు వింత ఆకారంలో ఉన్న ప్రాణులకు జన్మనివ్వడం ఈ మధ్య మనము చూస్తూనే ఉన్నాము.ఇకపోతే తాజగా ఓ మేక వింత ఆకారంలో ఉన్న జంతువుకి జన్మనిచ్చింది.

అయితే ఆ జంతువు అచ్చం కోతి ఆకారంలో ఉండడం విశేషం.ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజక వర్గం పెద్దేముల్ మండలంలో చోటు చేసుకుంది.

ఇక అసలు వివరాలు ఇలా ఉన్నాయి.పెద్దేముల్ మండలం ఇందూరు జైరాం తాండ గ్రామంలో పరుశురాం అనే వ్యక్తి వ్యయసాయం చేస్తాడు.దానికి తోడు 4 మేకలను కూడా మేపుకుంటూ ఉంటాడు.అతని వద్ద ఉన్న 4 మేకలలోని ఒక మేక మంగళవారం ఉదయం ప్రసవించింది.

అయితే ఆ మేక ఓ వింత ఆకారంలో ఉన్న పిల్లకి జన్మనిచ్చింది.ఆ మేక పిల్ల చూడడానికి కొంచెం కోతి ఆకారంలో, కొంచెం మేక ఆకారంలో వుంది.

Telugu Goat Monkey, Goat Born, Latest, Parashuram, Pedeemul, Strange Animal-Late

దీంతో అక్కడ చుట్టు పక్కల ఉన్న గ్రామస్థులు ఈ విషయాన్ని తెలుసుకుని వింత ఆకారంలో ఉన్న జంతువుని చూడడానికి తరలి వచ్చారు.అయితే ఇలాంటి సంఘటనలు చాలానే జరిగి ఉన్నాయి.ఇటీవల బషీరాబాద్ మండలం జీవంగిలో కూడా రెండు తలల గేదె దూడ జన్మించింది.ఈ సంఘటన మరువక ముందే.తాజగా పెద్దేముల్ మండలం ఇందూరు జైరాం తాండ గ్రామంలో ఓ మేక కోతి ఆకారంలో ఉన్న వింత జంతువుకి జన్మనివ్వడంతో ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.ఇంకా ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతాయోనని ముక్కున వేలేసుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube