వైర‌ల్‌.. ఎన‌ర్జీ డ్రింక్స్ కార‌ణంగా ఆ వ్యాధికి గురైన అమ్మాయి..

ఇప్పుడున్న జ‌న‌రేష‌న్ అమ్మాయిలు గానీ అబ్బాయిలుగా ఎన‌ర్జీ డ్రింక్స్‌కు అల‌వాటు అవుతున్న సంగ‌తి తెలిసిందే.ఒక‌ప్పుడు ఇంటి చిట్కాల‌తోనే ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు.

 Viral The Girl Who Got The Disease Due To Energy Drinks, Viral News, Energy Drin-TeluguStop.com

కానీ ఇప్పుడు రెడీమేడ్ డ్రింక్స్‌ల‌తో ఎన‌ర్జీని ఇమీడియెట్‌గా పొందాల‌ని అనుకుంటున్నారు చాలామంది.ఇక వారికి త‌గ్గ‌ట్టుగానే ఎన‌ర్జీ లెవెల్స్‌ను కేవ‌లం నిముషాల్లోనే పెంచేలా డ్రింక్స్‌ను తీసుకొస్తున్నాయి చాలా కంపెనీలు.

ఇక వీటిని మోతాదుకు మించి తాగితే శ‌రీరానికి న‌ష్టం అని పెద్దలు చెబుతుంటారు.కానీ ఇప్ప‌టి యూత్ మాత్రం అవేమీ ప‌ట్టించుకోకుండా తాగుతూనే ఉంటారు.

మ‌న‌కు బ‌య‌ట మార్కెట్‌లో దొర‌కుతున్న కూల్ డ్రింక్స్ లేదంటే ఎనర్జీ డ్రింక్స్ లాంటి వాటిని ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి.లేదంటే ప్రాణాల‌కే ప్ర‌మాదం అని ఇప్పుడు ఓ అమ్మాయిని చూస్తే అర్థం అవుతుంది.

స్విట్జర్లాండ్‌కు ఎందిన ఓ అమ్మాయి ఎనర్జీ డ్రింక్స్ ను చాలా ఇష్టంగా తాగుతూ ఉంటుంది.ఆమె ప్ర‌తి రోజు 12 ‘రెడ్ బుల్’ డ్రింక్స్ తాగ‌డం అల‌వాటుగా చేసుకుంది.ఇలా రోజూ తాగ‌డం చివ‌ర‌కు ఆమె ప్రాణాల మీద‌కు తెచ్చింది.17 ఏళ్ల మాషాకు ఓ రోజు స్కూల్లో కండ్లు తిరిగి ప‌డిపోయింది.దీంతో ఆమెను వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

Telugu Energy Drinks, Energydrinks, Heart, Masha, Mashadrinks, Switzerland-Lates

అయితే వారు చెక్ చేసి మాషాకు గుండె సంబంధిత వ్యాధి సంక్ర‌మించిన‌ట్టు చెప్ప‌డంతో అంతా షాక్ అయిపోయారు.ఇక మ‌రో విష‌యం ఏంటంటే నిత్యం మాషా ఎనర్జీ డ్రింక్స్ ను మోతాదుకు మించి తాగ‌డం కార‌ణంగానే ఈ వ్యాధి వ‌చ్చిన‌ట్టు డాక్ట‌ర్లు వెల్ల‌డించారు.దీంతో ఆమెకు స్పెష‌ల్ ట్రీట్ మెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు డాక్ట‌ర్లు.

ఇక ఈ విష‌యాన్ని టిక్ టాక్ ద్వారా మాస్ వెల్ల‌డిస్తూ ఎవ‌రూ కూడా త‌న‌లాగా ఎక్కువ‌గా ఎనర్జీ డ్రింక్స్‌ను అలవాటు చేసుకోవద్దంటూ సూచిస్తోంది.ఇప్పుడు ఈ న్యూస్ సోష‌ల్ మీడియాలో తెగ చెక్క‌ర్లు కొడుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube