వైరల్: బోటింగ్ చేద్దాం అని వెళ్లిన టూరిస్టులకు హార్ట్ ఎటాక్ తెప్పించిన చేప.. ఎందుకంటే..?!

సోషల్‌ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే బాగా పాపులర్ అవుతున్నాయి.

 Viral The Fish That Caused A Heart Attack To The Tourists Who Went To Go Boating-TeluguStop.com

ఈ క్రమంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక భారీ చేపకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్‌ అవుతోంది.ఆ చేపను చూసిన నెటిజన్లు అందరు ఒక్కసారిగా షాక్ కు గురి అవుతున్నారు.

సరదాగా బోటింగ్ కు వెళ్లిన పర్యాటకులకు ఈ వింతైన అనుభవం చోటు చేసుకుంది.అసలు వివరాల్లోకి వెలితే అమెరికాలోని ఫ్లోరిడాలో వీకీ వాచీ అనే ప్రదేశాన్ని సందర్శించడానికి తరచుగా టూరిస్టులు వచ్చి పోతుంటారు.

అది నదీ పరీవాహక ప్రాంతం అవ్వడంతో టూరిస్టులు అక్కడి ప్రకృతి అందాలను చూసేందుకు ఎక్కువగా తరలివస్తు ఉంటారు.

ఈ క్రమంలోనే కొందరు టూరిస్టులు బోట్లలో దిగి, నదిలో కయాకింగ్ (బోటింగ్ )చేయడం ప్రారంభించారు.

నదిలో నీరు స్వచ్ఛంగా ఉండడంతో టూరిస్టులు ఎంతో ఉత్సాహంగా అందులో కయాకింగ్‌ చేస్తున్నారు.సరిగ్గా ఆ సమయంలోనే ఓ భారీ చేప, దాని పిల్ల నెమ్మదిగా ఈదుకుంటూ రావడం టూరిస్టులు గమనించారు.

బోట్ల కింద నుంచి ఆ చేపలు రావడం చూసి టూరిస్టులు చాలా భయపడిపోయారు.కానీ వాళ్ళు బయపడినట్లు ఆ చేపలు వాళ్ళని ఏమీ చెయ్యలేదు.సైలెంట్ గా ఈదుకుంటూ బోటు కింద నుండి వెళ్లిపోయాయి.అవి వెళ్ళిపోయాక బోట్ లో ఉన్న టూరిస్టులు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఆ చేపలు చూడడానికి కూడా భలే వింతగా ఉన్నాయి.ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేయగా ఇప్పుడు ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది.

ఈ చేపలను మనాటీ చేపలు అని అంటారట.ఇవి చూడడానికి భారీ ఆకారంలో ఉన్నాగాని, మనుషులకు ఎలాంటి హానీ చెయ్యవట.

ఈ చేపలు ఎక్కువగా నీటిలోనే ఉంటాయి.వీటిని నీటి ఆవులుగా కూడా పిలుస్తారు.

ప్రస్తుతం దక్షిణ అమెరికాలోని అమెజాన్ నదిలో ఇవి ఎక్కువగా ఉంటాయి.అయితే మనం వాడే ప్లాస్టిక్ వ్యర్ధలను భూమిపై తిరిగే ఆవులు వాటికి తెలియకుండానే తిని ఎలాగైతే చనిపోతున్నాయో, అలాగే మనాటీ చేపలు కూడా సముద్రాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాల్ని తినేస్తుండటంతో అవి కూడా చనిపోతున్నాయి.

ప్లాస్టిక్ వాడకం ఎంత ప్రమాదకరమో తెలిసి కూడా అదే తప్పు మళ్ళీ మళ్ళీ మనం చేస్తూ ఉంటే ఇలాంటి అరుదైన ప్రాణులు అంతరించిపోయే ప్రమాదం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube