వైరల్: కొడుకు కోసం అదిరిపోయే బ్యాటరీ బైక్ ను తయారు చేసిన తండ్రి..!

నేటి సమాజంలో పిల్లలు టెక్నాలజీని వాడుకొని కొత్త కొత్త వస్తువులను పుట్టిస్తున్నారు.ఇక పనికిరాని వస్తువులను కూడా వాడి అద్భుతాలను సృష్టిస్తున్నారు.

 Viral The Father Who Made The Battery Bike For His Son, Battery Bike,20000 Thous-TeluguStop.com

ఇక తొక్కడానికి పనికిరాకుండా పోయిన సైకిల్‌ను బాగు చేయమని ఓ కొడుకు తన తండ్రిని అడిగితే.ఆ సైకిల్‌ను బ్యాటరీ బైక్‌గా తీర్చిదిద్దాడు ఆ తండ్రి.

గుంటూరుకు చెందిన మురళీకృష్ణ పదేళ్లుగా విశాఖలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో జువాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ అక్కయ్యపాలెంలో ఉంటున్నారు.ఇక తన కుమారుడు సూర్యసిద్ధార్థ (7)కు చిన్న సైకిల్‌ ఉండేది.

అది పూర్తిగా పాడైంది.దాన్ని బాగు చేయమని కొడుకు రెండేళ్ల కిందట అడిగాడు.

దీంతో పాత సైకిల్‌ను కొత్తగా తయారు చేయడం కంటే.దాన్ని చిన్న బైక్‌గా మార్చి తన కుమారుడికి ఇవ్వాలని మురళీకృష్ణ నిర్ణయించుకుని రూ.20 వేల ఖర్చుతో బైక్‌ను తాయారు చేశాడు.

ఇక బ్యాటరీ బైక్‌ తయారు చేయడానికి ఏయే వస్తువులు, సాంకేతికత అవసరమో మురళీకృష్ణ తెలుకున్నారు.

పాత సైకిల్‌ సామగ్రితో పాటు స్క్రాప్‌లో దొరికిన బైక్‌ల విడిభాగాలను తీసుకుని వాటిని తాను అనుకున్న మోడల్‌లో తయారు చేసుకున్నారు.అంతేకాక చార్జింగ్‌ బైక్‌ను తయారు చేసే క్రమంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యాయి.

బైక్‌కు మోటర్‌ కోసం డ్రిల్లింగ్‌ మెషిన్‌ మోటర్‌ను ముందు వినియోగించారు.దాని సామర్థ్యం సరిపోకపోవడంతో లారీ, బస్సుల అద్దాలను శుభ్రం చేసే వైపర్‌ మోటర్‌ను బైక్‌కు అమర్చారు.

ఇక కంప్యూటర్‌ యూపీఎస్‌ బ్యాటరీ పెట్టారు.రెండేళ్లకు తాను అనుకున్న విధంగా ‘హార్లీ డేవిడ్‌ సన్‌’ బైక్‌ రూపురేఖలతో చార్జింగ్‌ బైక్‌ను రూపొందించాడు.

అయితే ఆ బాలుడు తాయారు చేసిన బైకు ప్రత్యేకలు ఉన్నాయో ఒక్కసారి చూద్దామా.బైక్‌లో ఒక్కో భాగం ఒక్కో బైక్‌కు చెందినది.సెల్ఫ్‌ స్టార్ట్, త్రీ స్పీడ్‌ లెవెల్స్, కిలోమీటర్ల రీడింగ్‌తో స్పీడో మీటర్‌ ఉంటుంది.మోనో సస్పెన్షన్, సింగల్‌ షాక్‌ అబ్జార్బర్‌ ముందు, వెనుక డిస్క్‌ బ్రేక్‌లు మార్చారు.

బైక్‌కు అమర్చిన నాలుగు 12 ఓల్ట్స్, 7 యాంప్స్‌ బ్యాటరీలను 4 గంటల పాటు చార్జ్‌ చేస్తే 15 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.ఇక బైక్ 40 కిలోలు బరువును మోసే సామర్థ్యం ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube