వైరల్... ఏకంగా తన కొడుకునే అమ్మకానికి పెట్టిన ఉద్యోగి... అసలు కారణమిదే?

ప్రస్తుతం సోషల్ మీడియా హవా కొనసాగుతున్న పరిస్థితిలలో ఎక్కడ ఏ మూల జరిగినా ఇట్టే క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తుంది.దీంతో ఎన్నో రకాలుగా ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలను మనకు తెలుసుకునే అవకాశం ఉంటోంది.

 Viral The Employee Who Put His Son Up For Sale What Was The Real Reason, Viral V-TeluguStop.com

అయితే కొన్ని సార్లు ఎంతో హృదయవిదారకమైన విషయాలను మనం చూస్తూ ఉంటాం.తాజాగా పాకిస్థాన్ లో జరిగిన ఓ ఘటన నెటిజన్లను ఒక్కసారిగా షాక్ కు గురి చేసిందని చెప్పవచ్చు.

అయితే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అనేవి ఉంటాయి.ఎంత పెద్ద కష్టమచ్చినా ఆస్తులు అమ్ముకోవడానికైనా సిద్దమవుతారు, ఇంకా మానసికంగా బలహీనంగా ఉన్న కొంత మంది ఆత్మహత్య లాంటి ప్రయత్నం చేస్తారు.

కానీ స్వంత పిల్లలను మాత్రం అమ్ముకోవడానికి మాత్రం ఏ మాత్రం సాహసించరు.కానీ పాకిస్థాన్ దేశంలో ఓ పోలీసు నడి రోడ్డుపై తన స్వంత కొడుకు అమ్ముతానని రోడ్డు మీద వెళ్ళే వారిని తన బిడ్డను కొనుక్కోవాలని ప్రాధేయపడుతున్న ఈ వీడియో నెటిజన్లను కన్నీటి పర్యంతం చేస్తోంది.

ఈ పోలీసు తన కొడుకును అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే విషయాన్ని మనం పరిశీలిస్తే తన కొడుకును ఆపరేషన్ నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లడానికి  తన పైస్థాయి అధికారిని ఒక్క రోజు సెలవు అడిగితే ఆ ఉన్నతాధికారి సెలవు ఇవ్వడానికి నిరాకరించారు.

Telugu Fiftythousand, Leave, Pakistan, Son, Transfer-Latest News - Telugu

అంతేకాక సెలవు ఇవ్వాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో సదరు పోలీస్ లంచం ఇవ్వడానికి నిరాకరించారు.దీంతో అతనిని సిటీకి 120 కిలో మీటర్ల దూరం ఉన్న పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ ఫర్ చేశారు.దీంతో ఈ విషయంపై ఇంకా పై స్థాయి అధికారికి ఫిర్యాదు చేయడానికి వెళ్దామన్నా డబ్బులు లేవని తన కొడుకును కొనుక్కొని 50 వేల రూపాయలు ఇవ్వాలని పోలీస్ అధికారి వేడుకుంటున్న వీడియో నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ గా మారుతోంది.

నెట్టింట్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube