వైరల్: పులిపిల్లలకు కుక్క తల్లి అయింది.. ఎలాగో తెలుసా?

ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమకు సాటేది లేదు.కొన్నిసార్లు ఆ ప్రేమకు హద్దులే వుండవు.

 Viral The Dog Became The Mother Of The Tiger  Do You Know How , Tiger Kid, Dog,-TeluguStop.com

భిన్న జాతుల మధ్య ఇలాంటి ప్రేమను చూసినపుడు మనకు ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది.కానీ ప్రేమ అనేది విభిన్న జీవులలో కూడా మారదని మనకు కొన్ని ఉదాహరణలు కనిపిస్తాయి.

అలాంటి కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పిల్లల పట్ల తల్లి చూపించే ప్రేమకు సంబంధించిన వీడియోలను మనం తరచూ చూస్తూనే ఉంటాం.

కానీ ఓ తల్లి కుక్క అయివుండి, పులి పిల్లలను తన పిల్లలు మాదిరి సాకడం మీరు ఎప్పుడన్నా విన్నారా? ఏంటి జోక్ అని అనుకుంటున్నారా? కానీ ఇది సత్యం.

చైనాలోని ఓ జూలో పులి 3 పిల్లలకు జన్మనిచ్చింది.

అయితే పుట్టినప్పటి నుంచి ఆ పిల్లలను పులి తన దగ్గరకు రానివ్వలేదు, పాలివ్వలేదు.దీంతో ఆ పులి పిల్లలు అమ్మ ప్రేమకు దూరమయ్యాయి.

అయితే విషయాన్ని గమనించిన జూ నిర్వాహకులు ఆ 3 పులి పిల్లల ఆలనా, పాలనను ఓ ‘లాబ్రడార్ కుక్కకు‘ అప్పజెప్పారు.అక్కడితో ఆ శునకం ఆ 3 పులి పిల్లలకు తల్లిగా మారిపోయింది.

అక్కడినుండి వాటిని ఎంతో అపురూపంగా చూసుకుంటుంది.అవును.

ఇపుడు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఇక వీడియో తిలకించిన నెటిజన్లు ఆ కుక్కని ఆకాశానికెత్తేస్తున్నారు.

ప్రేమకు హద్దనేది లేదని ఒకరు, విశ్వాసంలో కుక్కల్ని మించినవారు ఈ ప్రపంచంలోనే ఉండరని మరొకరు, ఆ కుక్కని చూసి నేటి తల్లులు చాలా నేర్చుకోవాలని మరికొందరు ఇలా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.సదరు వీడియోని ఎ పీస్ ఆఫ్ నేచర్ అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడింది.

ఈ వీడియోలో ఆ శునకం పై ఎక్కి మూడు పులి పిల్లలు ఎంతే ప్రేమగా ఆడుకుంటున్నాయి.మీరు కూడా ఈ అద్భుతమైన వీడియోని తిలకించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube