వైరల్: ఇదే ఛాన్సనుకొని వధువు చెల్లికి ముద్దు పెట్టిన తుంటరి వరుడు.. బిక్కచచ్చిపోయిన వధువు?

ఈమధ్య సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు ఎక్కువైపోయాయి.ఏమాత్రం కాస్త ఆసక్తిగా వున్నా ప్రేక్షకులు వాటికి బ్రహ్మరధం పడుతున్నారు.

 Viral The Bridegroom Who Took This Chance And Kissed The Bride's Sister Is The B-TeluguStop.com

ముఖ్యంగా పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు అయితే తెగ వైరల్ అవుతున్నాయి.పెళ్లిళ్లలో జరిగే చిలిపి పనులు అన్నీఇన్నీ కాదు.

వధూవరుల స్నేహితుల అల్లరి, మరదలి చిలిపి సరసాలు ఇలా పెళ్లిలో చాలానే జరుగుతాయి.తాజాగా ఆ కోవకు చెందిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోలో ఏముందో ఒకసారి చూస్తే, వేదికపై ఉన్న వరుడికి.వధువు చెల్లి స్వీట్ తినిపించాలని ముందుకొస్తుంది.దానికి కూడా ఓ ముహూర్తం ఉందేమో అన్నట్టుగా ఆమె ఎదురు చూసి చూసి మరీ తన బావ నోట్లో లడ్డు పెడుతుంది.ఇక దాన్ని ఆ కొత్తపెళ్లి కొడుకు కొరుకుతున్నాడు అనుకొనే లోపే ఆమె కూడా ఆ స్వీట్ తినాలని ఆరాటపడుతూ ముందుకి లాక్కుంటుంది.

ఈ క్రమంలో వరుడి పెదాలు వధువు చెల్లి బుగ్గలకు తగులుతాయి.దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇక దాంతో వధువు చెల్లెలైతే మెలికలు తిరిగి పోతుంది.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కాగా, ఈ వీడియోను ‘bhutni_ke-memes’ అనే ఇన్‌స్టా పేజీ అప్‌లోడ్ చేసారు.కాగా దీనిపై నెటిజన్లు కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.‘దొరికింది చాన్సు, ఇక పెట్టెయ్ ముద్దు’ అని ఒకరు, ‘ఆ చాన్సు నాకు రాలేదు.నాకు మరదళ్ళు లేరు’ అని మరొకరు, ‘మనోడు తంతే బూర్లెగంపలో పడ్డాడు’ అని వేరొకరు ఇలా ఎవరికి నచ్చింది వారు కామెంట్ చేస్తున్నారు.

మీరు కూడా ఓసారి చూసి కామెంట్ చేయండి మరి!

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube