వైరల్: వెళ్తున్న విమానం నుండి అమాంతం కిందికి దూకేసిన ధైర్యశాలి.. వైరల్ వీడియో!

సోషల్ మీడియా విస్తృతి రోజురోజుకీ పెరుగుతున్నవేళ ప్రపంచం నలుమూలలా జరుగుతున్న వింతలూ, విశేషాలు నెటిజన్లను ఎంతగానో అలరిస్తున్నాయి.ఈ క్రమంలో ఓ వీడియో ఆహుతులను ఎంతో అలరిస్తోంది.

 Viral The Brave Man Who Jumped Down From The Plane, Viral, Flight, Social Media, Video Viral, Video Viral, Fallen Down ,bungee Jump-TeluguStop.com

మీరు బంగీజంప్ గురించి వినే వుంటారు.వేల అడుగుల ఎత్తు నుంచి అమాంతం కిందికి దూకడం అనే కళ గురించి తెలుసుగా.

అయితే ఇలా చేయాలంటే ఎంతో గట్స్ కావాలి.నిపుణులు, సాహసికులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.

 Viral The Brave Man Who Jumped Down From The Plane, Viral, Flight, Social Media, Video Viral, Video Viral, Fallen Down ,Bungee Jump-వైరల్: వెళ్తున్న విమానం నుండి అమాంతం కిందికి దూకేసిన ధైర్యశాలి.. వైరల్ వీడియో-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాక సాహసానికి సిద్ధమవుతారు.

ఇలా చేయాలని మనలో అనేకమంది కలలు కంటూ వుంటారు.

ఇది తమ జీవితంలో మరపురాని అనుభూతిగా మిగిలిపోతుంది.ప్యారాచూట్ల సహాయంతో సాహసకృత్యాలు చేస్తారు.

ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.వీటిని చూసిన నెటిజన్లు చాలా ఆనందానికి గురవుతూ వుంటారు.

అయితే భూమికి వేల అడుగుల ఎత్తులో గాలిలో ప్రయాణిస్తున్న విమానం నుంచి అమాంతం కిందకు దూకేస్తే..

అది కూడా ఏ మాత్రం రక్షణ చర్యలు చేపట్టకుండా.వింటూనే వెన్నులో వణుకు పుడుతోంది కదూ.ఇక్కడ అదే జరిగింది.ఈ వీడియో చూశాక అసలు విషయం మీకే అర్థమవుతుంది.

సదరు వీడియోలో ఏముందో ఒకసారి చూసినట్లయితే, స్కైడైవర్ ల్యూక్ ఐకిన్స్ పారాచూట్, వింగ్ సూట్ లేకుండా విమానం నుంచి 25,000 అడుగుల ఎత్తులో దూకి సురక్షితంగా కిందికి ల్యాండ్ అయ్యాడు.రెండు నిమిషాల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.2016లో ట్రెండింగ్ గా నిలిచిన ఈ వీడియో ట్విట్టర్‌లో మళ్లీ ఊపందుకుంది.నెటిజన్లు మరలామరలా దీన్ని చూస్తున్నారు.

అంతే కాకుండా ఇప్పుడు వైరల్ గా మారింది.ఈ ట్వీట్‌ను ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ఎలోన్ మస్క్ లైక్ చేయడం విశేషం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube