వైరల్: ప్రియురాలి ఇంటికి సొరంగం తవ్విన ప్రియుడు..!

ప్రియురాలిని దొంగతనంగా కలిసేందుకు ఒక ప్రియుడు ఏకంగా సొరంగం తవ్వి అందర్నీ ఆశ్చర్య పరిచాడు.చివరికి ఈ ప్రియుడు తన ప్రియురాలి భర్తకు చిక్కగా.

 Viral The Boyfriend Who Dug A Tunnel Into His Girlfriends House, Tunnel, Lover,-TeluguStop.com

ఆయన చేసిన సొరంగం గురించి అందరికీ తెలిసొచ్చింది.సాధారణంగా తమ ప్రియురాలిని కలవడానికి ప్రియుడు అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ ఈయన చేసిన ప్రయత్నం మాత్రం చాలా కొత్తగా వింతగా ఉంది.

పూర్తి వివరాలు తెలుసుకుంటే.అల్బెర్టో అనే ఓ మెక్సికన్ వ్యక్తి ఒక సొరంగ మార్గాన్ని నిర్మించాడు.

ఈ మార్గం గుండా విల్లాస్ డెల్ ప్రాడో 1 యొక్క టిజువానా ప్రాంతంలోని తన ప్రియురాలు పమేలా అనే మహిళను కలుసుకోవచ్చు.

తన భర్త జోర్జ్ సెక్యూరిటీ ఉద్యోగం చేసేందుకు బయటికి వెళ్లినప్పుడు పమేలా తన ప్రియుడిని ఈ సొరంగ మార్గం ద్వారానే తరచూ కలిసేది.

బయట నుంచి వెళ్తే ఎవరైనా చెప్తారు అన్న భయంతో భూమి కింద తవ్విన మార్గం ద్వారా అల్బెర్టో తన ప్రియురాలుని కలుస్తూ ఎంచక్కా ఎంజాయ్ చేసేవారు.అయితే ఒకరోజు జోర్జ్ తన విధులు ముగించుకుని త్వరగా ఇంటికి వచ్చేశాడు.

అయితే ఆ సమయంలో అతడి భార్య మరియు ప్రియుడు కార్యంలో పాల్గొంటున్నారు.ఈ విషయాన్ని ఇంట్లోకి రాగానే పసిగట్టిన జోర్జ్.

తన భార్యతో తప్పు చేస్తున్న వ్యక్తి ఎవరో కనుగొనాలని ప్రయత్నించాడు.

అయితే ఆ సమయంలోనే ఒక బెడ్ కదిలే శబ్దం రాగా దాని కింద చూడగానే అల్బెర్టో కనిపించాడు.

ఆ తర్వాత అతన్ని బాగా తిట్టడంతో.ఈ విషయాన్ని తన భార్యకు చెప్పవద్దని అల్బెర్టో జోర్జ్ ని బతిమిలాడాడు.

కానీ అందుకు జోర్జ్ నిరాకరించడంతో అల్బెర్టో వాగ్వాదానికి దిగాడు.దీంతో ఇరువురి మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

అయితే పోలీసులు వీరి విషయంలో జోక్యం చేసుకొని ఇద్దరినీ పోలీస్ స్టేషన్ కి తరలించారు.అయితే అల్బెర్టో కన్స్ట్రక్షన్ వర్క్స్ చేస్తున్నారు కాబట్టే ఇళ్ల కింద సొరంగాలు పెట్టగలిగాడు.

కానీ వేరొకరి భార్య తో అక్రమ సంబంధం పెట్టుకొని తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube