18-20 సంవత్సరాల వయస్సులో అమ్మాయి పూర్తి లైంగిక, భౌతిక మరియు సాంఘిక పరిపక్వతకు చేరుకుంటుంది.శరీరంలో మార్పులు కనిపిస్తాయి.
ఈ కాలం ప్రారంభంలో బాలికలలో హార్మోన్ల మార్పులు చురుకుగా ఉండటం ప్రారంభమవుతుంది.కానీ చిన్నప్పటి నుండి అమ్మాయిలాగే పెరిగిన సౌదీలోని రాజధాని రియాద్‌కు చెందిన రాందా షాబెలీ (21) విషయంలో అది జరగలేదు.
వయసుతోపాటు శరీరంలో జరగాల్సిన మార్పులు రాందా విషయంలో జరగలేదు.దీంతో ఆమె డాక్టర్లను సంప్రదించింది.
రకరకాల టెస్టుల అనంతరం డాక్టర్లు చెప్పింది విని షాకైంది.అసలు తాను అమ్మాయినే కాదనీ. పురుష జననేంద్రియాలు బయటకు కనపడకుండా పొత్తి కడుపులోనే ఉండిపోయాయని తెలుసుకుని షాక్ కి గురయ్యాడు.21 సంవత్సరాల పాటు అమ్మాయిలా జీవించి అబ్బాయిగా మారిన రాందా విస్తుపోయాడు.ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన పొరపాటు గురించి వివరించాడు.
ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.
రియాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో తాను జన్మించానని.పురుష జననేంద్రియాలు బయటకు కనపడకపోవడంతో అక్కడి డాక్టర్లు తనను అమ్మాయిగా భావించారని తెలిపాడు.
దీంతో తాను కూడా చిన్నతనం నుంచి అమ్మాయిలాగే పెరిగినట్టు వివరించాడు.అయితే 21ఏళ్ల వయసు వచ్చినా శరీరంలో మార్పులు రాకపోవడంతో.
కంగారు పడి వైద్యుని సంప్రదించినట్టు పేర్కొన్నాడు.ఈ క్రమంలో ఈ సంచలన విషయం బయటపడిందన్నాడు.
అయితే పొత్తి కడుపులో ఉన్న పురుష జననేంద్రియాలను బయట తీయడం కోసం శస్త్రచికిత్సలు చేయాలని డాకర్లు చెప్పినట్టు వెల్లడించాడు.అందుకోసం బ్రిటన్ వెళ్లాలని సూచించారని తెలిపాడు.
అంతేకాకుండా ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాల్లో తనను అబ్బాయిగా గుర్తించాలని.పేరును రాయెద్ మార్చాలని కోరుతూ సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్టు చెప్పాడు.
ఈ క్రమంలోనే తనను అమ్మాయిగా ముద్ర వేసిన ఆసుపత్రిపై కేసు పెట్టినట్లు తెలిపాడు.