వైరల్: లైబ్రరీకి 50 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన బుక్.. దాంతోపాటు..?!

కొన్నిసార్లు చాలా విషయాలు నమ్మబుద్ది కావు.అనేక విషయాలు మనకు వింతగా అనిపిస్తుంటాయి.

 Viral: The Book That Returned To The Library After 50 Years .. Besides ..?! Vira-TeluguStop.com

అయితే ఆవిషయాలు కొన్ని మాత్రమే మనం చూస్తుంటాం.అలాంటి ఘటనే ఇప్పుడు కూడా జరింగింది.

ఓ లైబ్రరీ నుంచి తీసుకున్న ఓ బుక్ ను 50 సంవత్సరాల తర్వాత మళ్లీ అదే లైబ్రరీకి చేరింది.ఇన్ని సంవత్సరాలు తమ వద్ద ఉంచుకున్నందుకు వారు పెనాల్టి కూడా చెల్లించారు.

ఈ ఘటన ఈశాన్య పెన్సిల్వేనియా లోని ప్లైమౌత్, పా లైబ్రరీలో సంభవించింది.బర్టన్ హాబ్సన్ ఈ బుక్ రాశారు.కాయిన్స్ యు కెన్ కలెక్ట్ అనేది ఈ బుక్ పేరు.1967వ సంవత్సరానికి ఈ బుక్ చెందుతుంది.ఈ బుక్ కాపీ పోయిన నెలలో 20 డాలర్ల ఫైన్ కట్టి లైబ్రరీకి వచ్చింది.

లైబ్రరికి ఈ బుక్ తో పాటుగా సైన్ లేకుండా ఉండే ఓ లెటర్ కూడా వచ్చింది.50 ఏళ్లకు ముందు ఓ బాలిక ఈ బుక్ ను 1971వ సంత్సరంలో తీసుకొచ్చింది.ఆ తర్వాత ఆ బాలికను వారి అమ్మానాన్న వేరే ఊరికి తీసుకెల్లడంతో ఆమె చాలా బాధపడింది.

ఆమె వేరే ఊరికి వెళ్తున్నట్టు తెలీదు.అనేకసార్లు ఆ పుస్తకాన్ని తిరిగి పంపిచేయాలనుకున్నప్పటికీ కుదరలేదు.

వాళ్లు ప్రతి సారీ ఇల్లు, ఊరూ మారుతూ వచ్చారు.ప్రతిసారి కుటుంబీకులు ప్లైమౌత్ బుక్ ప్యాక్ చేశావా అని జోకులు వేసేవారని తెలిపింది.

Telugu Library, Return, Latest-Latest News - Telugu

ఆ తర్వాత తాను 20 డాలర్ల జరిమానాతో బుక్ పంపించేసింది.అయితే ఆ డబ్బు తక్కువేనని కూడా ఆమె చెప్పింది.ఇన్ని విషయాలను పంచుకున్న ఆమె తన పేరును మాత్రం చెప్పకుండా పోయింది.లైబ్రరీ రికార్డులల్లో కూడా ఆమె పేరు కనుగొనలేకపోయారు.త్వరలోనే ఈ బుక్ ను ఆమె పంపిన లెటర్ ను లైబ్రరీ ఎగ్జిబిషన్ లో ఉంచనున్నట్లు తెలియజేశారు.ఆమె నిజాయతీగా ఇన్ని సంవత్సరాలకు పుస్తకాన్ని పంపడం గొప్ప విషయమని లైబ్రరీ వర్గాలు ప్రశంసించాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube