వైరల్: పిల్లాడి ట్వీట్ కు రిప్లై ఇచ్చిన అధికారులు..!

ప్రస్తుత రోజులలో చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ఉపయోగించడం పరిపాటిగా మారింది.కొంతమంది టెక్నాలజీని మంచికి ఉపయోగిస్తే.

 Viral Latest, Viral News, Odisa, Bhuvaneshwar Transport , Tweets Viral, Student-TeluguStop.com

మరికొందరు టెక్నాలజీని చెడు పనులకు వినియోగిస్తూ ఉండడం మనం గమనిస్తూనే ఉంటాం.అయితే తాజాగా ఓ చిన్న పిల్లవాడు చేసిన ట్వీట్ చాలా సీరియస్ గా తీసుకున్న అధికారులు వెంటనే స్పందించి ఆ పిల్లవాడే సమస్యను తీర్చే ప్రయత్నం మొదలుపెట్టారు.

ఓ పిల్లవాడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా చక్కర్లు కొడుతోంది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.

ఒడిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్ కు చెందిన సాయి అనే ఒక బాలుడు రోజు ఎదుర్కొంటున్న సమస్యను రాజధాని ప్రాంత అర్బన్ ట్రాన్స్ పోర్ట్ విభాగ అధికారులకు తెలియజేశాడు.ఇంతకీ ఆ బాలుడు ట్వీట్ లో ఏం తెలిపాడని అనుకుంటున్నారా.? ” నా స్కూల్ రిపోర్టింగ్ టైం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు కానీ మా ప్రాంతంలో బస్సు ప్రారంభమయ్యే సమయం 7:40 దీంతో నాకు స్కూల్ వెళ్లడానికి రోజు లేట్ అవుతుంది” అంటూ ఆ బాలుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు సదరు అధికారులను ట్యాగ్ చేస్తూ.

ఈ బాలుడు చేసిన ట్వీట్ ను చూసిన అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ భువనేశ్వరి అరుణ్ వెంటనే స్పందించి.ఇక ఇప్పటి నుంచి ఆ ప్రాంతంలో మొదటి బస్ 7 గంటలకే ప్రారంభం అవుతుందని ఇకపై నీకు స్కూల్ కి లేట్ అవ్వదు అంటూ సాయి ట్వీట్ కు సమాధానం ఇచ్చాడు.ఇలా బాలుడు విన్నపం చూసి వెంటనే స్పందించిన అధికారులు పై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపించడం, అలాగే నెటిజెన్స్ బోత్రా, ట్రాన్స్‌పోర్ట్ విభాగంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఏది ఏమైనా సోషల్ మీడియా ద్వారా కొన్ని అంత సులువుగా పూర్తికాని పనులు కూడా చాలా త్వరగా పూర్తి కావడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.కాబట్టి అవసరం లేని పోస్టులు చేయకండి ప్రజలకు ఉపయోగపడే పోస్ట్ లు చేస్తూ ఉపయోగపడితే చాలు మేలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube