వైరల్: అందుకోసం ఆ ఇద్దరు భార్యాభర్తలు ఏకంగా విమానాన్నే బుక్ చేసేసుకున్నారు..!

గడచిన సంవత్సరం పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలను ఏవిధంగా ఇబ్బంది పెట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కరోనా వైరస్ కారణంగా ఎన్నో వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు, ఎన్నో ఇండస్ట్రీలు మూత పడి ఇప్పుడిప్పుడే అన్ని తిరిగి తెరచుకుంటు వారి వ్యాపార కార్యకలాపాలు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.

 Indonesia Flight, Social Media, Viral Post, Instagram, Corona Epidemic, Jakarta,-TeluguStop.com

ఇక ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదిలా ఉండగా ప్రజలు ఎవరు అంతకు వారు వారి సంరక్షణ కోసం మాస్కులు ధరించడం, శానిటైజర్ ఉపయోగించడం, సామాజిక దూరం పాటించడంతో పాటు అనేక జాగ్రత్తలు పాటిస్తున్నారు.

ఇలాంటి మార్గాలు తప్ప మరొకటి లేదని వైద్యులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.ఈ తరుణంలో ఒక వ్యక్తి కరోనా వైరస్ నుంచి తాను తన భార్యను కాపాడుకోవడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఎవరికి కరోనా వైరస్ ఉందో, కరోనా వైరస్ ఎవరి ద్వారా వ్యాప్తి చెందుతుందో గుర్తుపట్టలేని స్థితిలో ఆ వ్యక్తి తన భార్య ప్రయాణం చేయడానికి ఏకంగా ఒక విమానాన్ని బుక్ చేసుకున్నాడు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఆ వ్యక్తి తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేశాడు.

Telugu Corona Epidemic, Indonesia, Jakarta, Richard Mulzadi-Latest News - Telugu

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… జకర్తా దేశానికి చెందిన రిచర్డ్ ముల్జాది అనే వ్యక్తి తన భార్య ప్రయాణం కోసం ఏకంగా ఓ విమానాన్ని బుక్ చేసుకున్నాడు.ఈ పోస్ట్ లో ” నేను, నా భార్య మాత్రమే ఈ విమానంలో ప్రయాణం చేసేందుకు వీలుగా ఉండేందుకు మొత్తం విమానాన్ని బుక్ చేసుకున్నాం.మమ్మల్ని మేము రక్షించుకునే తరుణంలో సామాజిక దూరం పాటిస్తూ తగిన చర్యలు తీసుకుంటూ ఈ విమానంలో మేము ఒక్కరమే ప్రయాణించాం” అంటూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేశాడు.ఈ పోస్ట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.

ఈ పోస్ట్ ని చూసిన కొందరు నెటిజెన్స్ ఎంత కరోనా ఉన్న మాత్రాన ఇంత సామాజిక దూరం పాటించాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనా కానీ డబ్బు ఉంటేనే ఇలాంటివి సాధ్యం అవుతాయని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

ఈ ప్రయాణానికి సంబంధించి విమాన సంస్థ అయిన ఎయిర్ గ్రూప్ వారు స్పందించి.ఆ విమానంలో ప్రయాణించడానికి ఇలా విమానం మొత్తాన్ని బుక్ చేసుకోవడానికి విమాన సంస్థ కు ఆ వ్యక్తి ఏకంగా 7895 డాలర్స్ చెల్లించాల్సి వచ్చిందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube