వైరల్: ఆ వధువు అంతగా నవ్వింది అందుకేనట..!

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా సోషల్ మీడియాలో వారి సమయం గడుపుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం.ఇంట్లో ఉండే వారికంటే ఎక్కువ శాతం సోషల్ మీడియాలోని వారి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నవారు కూడా ఎందరో.

 Viral Thats Why The Bride Smiled So Much, Bride, Laughfing, Social Meida, Cinima-TeluguStop.com

తాజాగా సోషల్ మీడియాలో ఒక వధువు వీడియో వైరల్ అయిన సంగతి అందరికి విదితమే.వీడియో ఆధారంగా ఒక క్లిప్ లో భాగంగా వధువును ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ చూపించిన ఉత్సాహానికి ఆగ్రహానికి గురైన వరుడు ఫోటోగ్రాఫర్ పై విరుచుకు పడిన వీడియో అందర్నీ నవ్వించే లాగా చేసింది.

ఈ వీడియోలో ఫోటోగ్రాఫర్ ని వరుడు కొట్టిన తరువాత వధువు రియాక్షన్ చూసి అందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వుతున్నారు.వాస్తవానికి ఆ పెళ్లి కొడుకు చేసిన పనికి నవ్వు ఆపుకోలేక కిందపడి మరి నవ్వడం మొదలు పెట్టింది ఆమె.కానీ, నిజానికి ఆమె నవ్వడానికి గల కారణం ఏమిటా అని ఎందుకు సంబంధించి అసలు విషయం బయటకు వచ్చింది.

వాస్తవానికి ఆ వీడియోలో జరుగుతున్నది నిజమైన పెళ్లి కాదట.

 అది ఒక సినిమా షూటింగ్ లో భాగం అని వీడియోలో వధువు గా కనిపించి ఉన్న యువతి స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.ఆ వీడియోలో వధువు కనిపిస్తున్న అంక్రితి చౌహాన్ (Anikriti Chouhan) స్పందిస్తూ.

ఆ వీడియో తన సినిమా కోసం తీసిన వీడియో క్లిప్ అని తెలియచేసింది.చత్తీస్ ఘడ్ కు చెందిన ఈమె అక్కడే తెరకెక్కిస్తున్న ‘డార్లింగ్ ప్యార్ జుక్తా నహి’ (darling pyaar jhukta nahi) అనే సినిమా కోసం షూటింగ్ తీసింది అని తెలియజేసింది.

దానికి చాలా మంది అది తన పెళ్లి వీడియో అని అనుకున్నారని.కానీ, అది షూటింగ్ లో భాగంగా ఒక వీడియో అని స్పష్టంగా తెలియజేసింది అందరికీ.

ఈ వీడియో వీక్షించిన వారి అందరికీ నా ధన్యవాదాలు అంటూ అంక్రితి తెలియజేసింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube