వైరల్: అంత చిన్న బ్రెడ్ ముక్క ఏకంగా రూ.3 వేలా..?!

ఈ మధ్యకాలంలో హోటల్ బిల్లులు తెగ వైరల్ అవుతున్నాయి.ఒక పెద్ద హోటల్ కి వెళితే ఒక 2000 పెడితే చాలు కడుపు నిండా ఫ్యామిలీ మొత్తం భోజనం చేయొచ్చు.

 Viral That Much Of Little Bread Part Cost Three Thousand, Woman ,pays ,rs 3,000 , Chicken Dish, London, Portion Size, Shocks ,twitter, London, Three Thousand Bill, Half Bread Part, Viral , 3000 Rs-TeluguStop.com

ఇంకొన్ని చోట్ల అయితే 100కు 500 రూపాయలకు కూాడా మంచి ఫుడ్ అందుబాటులో ఉంది.ఒకవేళ వారు చికెన్, మటన్ బిర్యానీలు తిన్నా కూడా వారికి 3000కి మించి బిల్లు దాటదు.

అయితే తాజాగా ఓ హోటల్ కి వెళ్లిన మహిళకు షాకింగ్ సీన్ జరిగింది.హోటల్ కి ఆకలితో వెళ్లిన ఓ మహిళ మీల్స్ కావాలని కోరింది.

 Viral That Much Of Little Bread Part Cost Three Thousand, Woman ,Pays ,Rs 3,000 , Chicken Dish, London, Portion Size, Shocks ,Twitter, London, Three Thousand Bill, Half Bread Part, Viral , 3000 Rs-వైరల్: అంత చిన్న బ్రెడ్ ముక్క ఏకంగా రూ.3 వేలా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఇండియా కరెన్సీలో ఆ మహిళకు 3000 రూపాయల బిల్లు అయ్యింది.తీరా ఆ ఫుడ్ వచ్చాక అది ఒక చిన్న పిల్లాడికి కూడా సరిపోని విధంగా ఉంది.

ఒక ప్లేట్ లో సగం ఆఫ్ బ్రెడ్ ముక్క రూపంలో ఆహారాన్ని తెచ్చారు.ఆ భోజనానికి కొంచెం పక్కగా సాస్ ఉంది.

అది చిన్న పిల్లలకు సరిపోని విధంగా ఉంది.

ఆఫ్ బ్రెడ్ ముక్కంత ఉండే ఆ భోజనాన్ని చూసి ఆ మహిళ ఒక్కసారి షాక్ అయ్యింది.

బిల్లును చూస్తే గుండె ఢబేల్ మంది.ఫుడ్ చూస్తే ఆకలి కూడా పారిపోయేలా ఉంది.

లండ‌న్‌ లోని ఫేమ‌స్ బిల్డింగ్ షార్డ్‌లోని హోట‌ల్‌ లో ఈ ఘటన జరిగింది.

ఆ మ‌హిళ‌ చాలా ఖ‌ర్చు పెట్టినప్పటికి కూడా త‌న క‌డుపు నిండలేదు.వెంటనే క‌డుపు మండిపోయి కోపంతో త‌న‌కు తీసుకొచ్చిన ఆ చిన్న పరిమాణంలోని భోజనాన్ని ఫోటో తీసి త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్టు చేసింది.దీంతో నెటిజ‌న్లు ఆ ఫోటోను చూసి ఖంగుతిన్నారు.

చాలా మంది ఫుడ్ మెనూ చూసి మోసపోతారని, మెనూ కార్డు కాకుండా తక్కువ ధరల్లో లభించే మంచి ఫుడ్ ఏదో తెలుసుకుని తినడం మంచిదని ఆమె తెలిపింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube