వైర‌ల్‌.. బండ‌రాళ్ల న‌డుమ వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న కారు..

Viral That Car Tripped In That Rocky Outcrop

ఈ మ‌ధ్య దేశంలో వ‌ర్షాలు ఎంత‌లా బీభ‌త్సం సృష్టిస్తున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ వ‌ర్షాల కార‌ణంగా చాలామంది నిరాశ్ర‌యుల‌య్యారు.

 Viral That Car Tripped In That Rocky Outcrop-TeluguStop.com

ఇంకొంద‌రు ఉన్న ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు.చాలా న‌గ‌రాల్లో ఇండ్లు నీట‌మునిగి జ‌నాలు చాలా ఇబ్బందులు ప‌డ్డారు.

ఇంకొన్ని చోట్ల అయితే ప్రాణాలు కూడా కోల్పోయారు.ఇక‌పోతే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కూడా ఈ మ‌ధ్య భారీ వర్షాలు కుండ‌పోత‌లా కురుస్తున్నాయి.

 Viral That Car Tripped In That Rocky Outcrop-వైర‌ల్‌.. బండ‌రాళ్ల న‌డుమ వ‌ర‌ద‌ల్లో చిక్కుకున్న కారు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాంతో ఆ రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా కొండచరియలు విరిగిపడిపోతున్నాయి.

ఇక ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి ఉత్త‌రాఖండ్లో చోటుచేసుకుంది.

ఓ ద‌గ్గ‌ర కొండచరియలు ఇలాగే భారీగా విరిగి పడిపోవ‌డంతో పెను బీభ‌త్సమే జ‌రిగిపోయింద‌తి.ఇక ఇందులో ఓ కారు ఇరుక్కుపోయిది.

ఇంకేముంది స‌హాయం చాలా ప్ర‌య‌త్నాలు చేశారు.చివ‌ర‌కు బోర్డ‌ర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) రంగంలోకి దిగి వారిని సురక్షితంగా కాపాడారు.

పైగా కారును కూడా బ‌య‌ట‌కు లాగింది ఈ టీమ్‌.ఇలా ఆ కారులో ఉన్న వారంతా ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు.లేదంటే మాత్రం ఆ వ‌ర‌ద‌ల్లోనే కొట్టుకుపోయేవారు.అయితే కారు రెండు పెద్ద బండరాళ్ల న‌డుమ ఇరుక్కుంది.

ఇది చూడ‌టానికే చాలా ప్రమాదకరంగా ఉంది.ఆ రాళ్ల మధ్యలోంచి వ‌ర‌ద నీరు కూడా చాలా వేగంగా ప్ర‌వ‌హిస్తుండ‌టంతో వారిని కాపాడేందుకు బీఆర్ వో టీమ్‌కు చాలా కష్టమైన ప‌ని అయిపోయింది.ఈ ఉదంతం బద్రీనాథ్ నేష‌న‌ల్ హైవేకు ద‌గ్గ‌ర‌లోని స్వోలెన్ లంబగడ్ నల్లా ద‌గ్గ‌ర జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.రాష్ట్రంలో చాలా రోజులుగా భారీ వర్షాలు ప‌డుతున్న నేప‌థ్యంలో ఇలాగే కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయ‌ని చెబుతున్నారు అధికారులు.

కాబ‌ట్టి ఇలాంటి స‌మ‌యంలో కొండ చ‌రియ‌లు ఉన్న ప్రాంతంలో జాగ్ర‌త్త‌గా వెళ్లాల‌ని సూచిస్తున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.

#Bhadrinadh #Team #Uttara Khand #SvolenLambagad #Car Tripped

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube