వైరల్: నెక్లెస్ రూపంలో దర్శనమిస్తున్న టెలిఫోన్ కేబుల్స్..! వాటి ధర ఎంతో తెలుసా..?!

నేటి ఆధునిక తరంలో అందరూ కూడా వివిధ రకాల ఫ్యాషన్ ఉత్పత్తులు వైపు మొగ్గు చూపుతున్నారు.మార్కెట్ లో ఎటువంటి ట్రెండ్ కొనసాగితే అదే ట్రెండ్ ను అందరు ఫాలో అవుతున్నారు.

 Necklece, Viral News, Viral Latest, Telephone Cable, Cost , Matching, Ear Rings,-TeluguStop.com

వాటిలో ముందుగా ఉండేది అమ్మాయిల యాక్ససరీలు, దుస్తులు, ఆభరణాలు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ట్రెండ్ కి తగ్గట్టు నిత్యం ఫ్యాషన్ గా ఉండేందుకు యత్నిస్తున్నారు.

అయితే ఫ్యాషన్ అంటే ఒకే కానీ అదే పేరు చెప్పి కొందరు వింత వస్తువులు, బట్టలు, ఆభరణాలు ధరించి అదే ట్రెండ్ అని ఇష్టం వచ్చినట్లు ఉంటున్నారు.తాజాగా ఇప్పుడు ఇలాంటి ఒక విచిత్రమైన ఓ ఫ్యాషన్ ప్రొడక్ట్ ట్రెండీగా మారింది.

ఇంతకీ అదేంటి అని అనుకుంటున్నార ?! అది ఏంటి అంటే ఒక టెలిఫోన్ కేబుల్‌ అండి ఏంటి మీకు అర్ధం కాలేదా? అయితే పూర్తి వివరాలు తెలుసుకోండి.

ఇటలీకి చెందినలగ్జరీ బ్రాండ్స్ తయారీదారు బొట్టెగా వెనెటా ఒక షాకింగ్ ఆభరణాన్ని విక్రయిస్తోంది.

అది చూసేందుకు అచ్చం మన ల్యాండ్ లైన్ ఫోన్ కేబుల్‌ను పోలి ఉంటుంది.అంటే ఫోన్ నుంచి రిసీవర్‌ ను కలిపే కేబుల్ వైరు ఉంటుంది కదా దానిలాగా ఉంటుంది అన్నమాట.

ఆ కేబుల్ వైరు చిన్న చిన్న రింగులు తిరిగి ఉంటుంది కదా.అయితే ఇప్పుడు అలాంటి కేబిల్ వైరును పోలిన ఆభరణాన్ని తయారు చేసారు.కానీ దాన్ని భిన్న రకాల లోహాలతో తయారు చేశారు.ఇంకా విచిత్రం ఏంటంటే ఆ ఆభరణం ఖరీదు అక్షరాలా 2వేల డాలర్లు.అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.1,45,189 అన్నమాట.ఏంటి ధర చూసి షాక్ అయ్యారా.

Telugu Cost, Ear, Necklece, Telephone Cable, Latest, Womens-Latest News - Telugu

ఆ కేబుల్ ఆభరణంతోపాటు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ను కూడా కలిపి ఇస్తారు.ఒకవేళ మీకు కూడా ఈ ట్రెండి ఆభరణం కావలిస్తే ఇలా చేయండి.ఆ కేబుల్ నెక్లెస్‌ ను ఆ బ్రాండ్‌కు చెందిన ఆన్‌లైన్ స్టోర్‌ లో మాత్రమే కొనుగోలు చేయవచ్చు.

అయితే ఆ నెక్లెస్‌ ను చూసిన నెటిజన్లు దానిపై ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.ఇది ఒక ఫ్యాషన ? అసలు దీన్ని ఎవరన్నా కొంటారా.? లక్షా యాభై వేలు పెట్టి టెలిఫోన్ కేబుల్‌ను మేము కొనుక్కోవాలా ? ఇంతకు మించిన దరిద్రం ఇంకొకటి లేదు.నిజంగా ఫ్యాషన్ అనే పేరుతో రకరకాల ఆభరణాలు తయారుచేసి మార్కెట్లో విడుదల చేస్తున్నారు.

అని కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఈ కేబుల్ నెక్లెస్‌ విషయం సోషల్ మీడియాలో తాజాగా హాట్ టాపిక్‌గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube