వైరల్: మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తి ప్రాణాలు కాపాడిన టెక్నాలజీ..!

రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.అలా వాళ్ళ కుటుంబాలు సైతం రోడ్డున పడుతున్నాయి.

 Viral: Technology That Saves The Life Of A Person Who Drives Under The Influence-TeluguStop.com

ప్రతి రోజు ఎక్కడో ఒకచోట ఇలాంటి రోడ్డు ప్రమాదాలు షరా మాములు అయిపోతున్నాయి.మద్యం సేవించి డ్రైవ్ చేయడం గాని స్పీడ్ గా వెళ్లడం వంటి తప్పిదాల వలన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి.

అయితే ఈ క్రమంలో ఇప్పుడు ఒక వీడియో సోసిల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.బాగా మద్యం సేవించి ఆ మత్తులో కార్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ప్రాణాలతో పాటు, ఎదుటి వారి ప్రాణాలను కూడా కాపాడింది ఒక టెస్లా కారు.

ఏంటి కార్ ప్రాణాలను కాపాడడం ఏంటి అని అనుకుంటున్నారా నిజంగానే టెస్లా కంపనీ కారు ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడడంతో పాటు అతడు ప్రమాదంలో ఉన్నాడనే విషయాన్నీ ఎమర్జెన్సీ సర్వీస్ వాళ్ళకి సిగ్నల్ కూడా పంపింది.

టెస్లా కంపెనీ గొప్పతనం ఏంటంటే టీవీలలో టెస్లా కంపెనీ కార్ల గురించి ఎటువంటి ప్రొమోషన్స్ ఉండవు.

అయినాగానీ ఈ టెస్లా కంపెనీ కార్లు హాట్ కేకుల్లాగా అమ్ముడు పోతాయి.ఎందుకంటే ఈ కార్ల లలో ఉండే ఫీచర్స్ అలాంటివి మరి.టెస్లా కారులో డ్రైవర్ కార్ డ్రైవ్ చేయాలిసిన పని లేదు.వాటంతట అవే డ్రైవ్ చేస్తాయి.

దర్జాగా డ్రైవర్ వెనుక సీట్లో కూర్చుంటే చాలు.

కారులో ఉన్నా ఆటోపైలట్ ఫీచర్ వలన కార్ అదే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది.అయితే టెస్లా ఆటోపైలట్ ఫీచర్‌ ను ఉపయోగిస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితులలో డ్రైవర్‌ కూడా సీట్లో తప్పనిసరిగా ఉండాలని చెప్తున్నారు.ఆటో ఫీచర్ బాగానే పని చేస్తున్నాగాని కొన్ని కొన్ని సార్లు వాహనం పట్టుతప్పితే చేదాటిపోతుంటే దాన్ని అదుపులో చేయడానికి డ్రైవర్ సీట్ లో వ్యక్తి ఉండాలని సూచిస్తున్నారు.

ఇప్పుడు ఇదే టెస్లా కారు ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడింది.ఎలా ఏంటో అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

నార్వే దేశానికీ చెందిన 24 ఏళ్ల వ్యక్తి ఫుల్ గా మందు కొట్టేసి టెస్లా ఎస్ మోడల్ కారులో రోడ్డు మీద ప్రయాణానికి సిద్ధం అయ్యాడు.అతను కూర్చోవడానికి డ్రైవర్ సీట్ లోనే కుర్చున్నాగాని మద్యం తాగి ఉండడం వలన ఆ వ్యక్తి మతి తప్పి సొమ్మసిల్లి పడిపోయూడు.కార్ లో ఉన్న ఆటో ఫీచర్ వలన కార్ అతన్ని కొంతమంది దూరం పాటు సురక్షితంగా తీసుకుని వెళ్లినది.అయితే కొద్ది సేపటికి డ్రైవర్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఉన్నటుండి కార్ లో ఉన్న ఆటోపైలెట్ ఫీచర్ కారును రోడ్డు పక్కన ఆపేసింది.

కారును పక్కకు ఆపడంతో పాటు డేంజర్ అనే హజార్డ్ లైట్లను ఆన్ చేసి ఎమర్జెన్సీ సర్వీసుకు సిగ్నల్స్ పంపింది.ఈ మొత్తం దృశ్యాన్ని ఎవరో వ్యక్తి వీడియో తిసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ గా మారింది.

ఇలా ఓ కారు ఒక నిండు ప్రాణాన్ని కాపాడిందని అందరూ ఆ కారును మెచ్చుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube