వైరల్: కన్నీళ్లు తెప్పిస్తున్న గెటప్ శ్రీను పర్ఫామెన్స్

తెలుగు బుల్లితెర పై ప్రేక్షకులను బాగా నవ్వించే కామెడీ షో ఏమిటి అంటే అందరూ ఇచ్చే ఏకైక సమాధానం జబర్దస్త్ అని.ఈ షోలో కొందరు అద్భుతమైన నటనతో పాటు, కామెడీ చేస్తూ ప్రేక్షకులను బాగా అక్కటుకుంటారు.

 Viral Tearful Getup Srinu Performance-TeluguStop.com

అందులో ముఖ్యంగా కొంతమంది నటులు వారి నటనతో ప్రేక్షక అభిమానుల మనసును సొంతం చేసుకుంటారు.అలాంటి వారిలో ముందువరుసలో ఉండే వ్యక్తి గెటప్ శీను.

అప్పట్లో నాగబాబు గెటప్ శీను ను బుల్లితెర కమలహాసన్ అంటూ కన్ఫామ్ కూడా చేశాడు.ఒక్కొక్క వారానికి ఒక్కో గెటప్ తో ప్రేక్షకుల ముందుకు కనిపిస్తూ అందరిని అభిమానాన్ని, మనసులను దోచే చేసుకుంటాడు గెటప్ శీను.

 Viral Tearful Getup Srinu Performance-వైరల్: కన్నీళ్లు తెప్పిస్తున్న గెటప్ శ్రీను పర్ఫామెన్స్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాజాగా గెటప్ శీను ఒక స్కిట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.న్యూ ఇయర్ సందర్భంగా ఈటీవీ ఛానల్ లో డీజే అనే కార్యక్రమం ప్రసారం అయింది.

అందులో భాగంగానే గెటప్ శీను చేసిన ఒక స్కిట్ అందర్ని కంటతడి పెట్టించడంతో పాటు అందరి మనసును కలిచి వేశాడు శీను.ఈ స్కిట్ లో భాగంగా కోట్ల మంది రైతులు పడుతున్న కష్టాలను వారి కన్నీటిని తెలియజేస్తూ ఒక స్కిట్ ను రూపుదిద్దాడు.

ప్రిన్స్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో భళ్లుమంటూ నింగి అనే పాటకు గెటప్ శీను స్కిట్ చేసి, రైతులు పంట పండించేటప్పటి నుంచి కోత కోసే వరకు పడే కష్టాలు, దళారులు వ్యాపారులు చేతులలో వాళ్ళు ఎలా ఇబ్బందులు పడుతున్నారు అన్న అంశాలపై స్కెచ్ చేసి అందరిని మెప్పించాడు శీను.

స్కిట్ లో భాగంగా ఒక రైతుగా గెటప్ శీను నటించాడు.నిజానికి గెటప్ శీను స్కిట్ లో రైతుగా జీవించేసాడు అంటే నమ్మండి, స్కిట్ లో భాగంగా రైతు తన జీవితంలో ఎలాంటి కష్టాలు పడతాడు, దళారుల చేతిలో రైతులు ఎలా మోసపోతారు అన్న అంశాన్ని చూసి అందరి కంటి నుండి నీరు ఆగలేదు. రైతు బాధ అందరికి తెలిసే విధంగా గొంతు కోసుకుంటూ రైతే రాజు అంటూ ప్రాణాన్ని విడుస్తాడు శీను.

ఈ స్కిట్ ను చూసిన జడ్జ్ రోజా, యాంకర్లు రష్మిక, అనసూయతో పాటు అక్కడ ఉన్న వారు అందరూ కూడా కంటతడి పెట్టుకున్నారు.దీంతో కేవలం కామెడీ మాత్రమే కాదు మేము అన్నీ క్యారెక్టర్ రోల్స్ చేయగలం, మా టాలెంట్ ను మేము నిరూపించుకుంటాము అన్నట్టు నటులు ప్రతి వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరూ ఆకట్టుకుంటున్నారు.

#Anasuya #Farmer #Jabardasth #Skit #Rashmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు