వైర‌ల్‌.. అఘోరా, అఘోరీల వివాహం..

అఘోరా అనే పేరు వింటేనే అంద‌రికీ గుర్త‌కు వ‌చ్చేది శ్మ‌శానం.వీరి పేరువింటే ఒకింత భ‌యం కూడా వేస్తుంది.

 Viral Tamilnadu Aghora Manikandan Marriage With Aghori-TeluguStop.com

పురాత‌న కాలం నుంచి వీరి గురించి ఓ ప్ర‌చారం ఉంది.వారికి కొన్ని అతీత‌మైన శ‌క్తులు ఉంటాయ‌ని, వారు అత్యంత ప్ర‌మాద‌క‌రం అని, వారు మామూలు మ‌నుషులు కాద‌ని ఇలా అనేక ర‌కాలుగా వారి మీద ప్ర‌చారాలు ఉన్నాయి.

అయితే వీరి విష‌యంలో పెండ్లి అనేది అసాధార‌ణం.ఎందుకంటే అఘోరాలు మ‌న‌కు తెలిసినంత వ‌ర‌కు అస‌లు వివాహాలు చేసుకోరు.

 Viral Tamilnadu Aghora Manikandan Marriage With Aghori-వైర‌ల్‌.. అఘోరా, అఘోరీల వివాహం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే విష‌యం వింటే నిజంగానే షాక్ కు గుర‌వుతారు.

ఎందుకంటే ఇప్పుడు అగోరా, అఘోరీ క‌లిసి పెండ్లి చేసుకున్నారు.

నిజానికి శ్మ‌శానంలో ఉండి, బూడిద‌ను ఒళ్లంతా రాసుకుంటూ క‌నిపిస్తారు.అలంకారానికి అత్యంత దూరం పాటిస్తారు.

ఎలాంటి బ‌ట్ట‌లు క‌ట్టుకోకుండా అలాగే ఉండిపోతారు.వారిని చూస్తేనే ఒకింత భ‌యందోళ‌న క‌లుగుతుంది.

అయితే ఇప్పుడు తమిళనాడుకు చెందిన మణికందన్ మొద‌టి నుంచి అఘోరాగా మారాల‌ని అనుకుంటున్నాడు.అనుకున్న‌ట్టుగానే కాశీ వెళ్లి అఘోరగా మారాడు.

ఇక త‌న ద‌గ్గ‌ర శిష్యులుగా ప‌నిచేస్తున్న అఘోరీని ఆయ‌న పెండ్లి చేసుకున్నారు.

Telugu Aghora Manikandan, Aghora Marriage, Aghora Weds Aghori, Agora Marriage, Lady Aghora, Tamil Nadu Aghora, Tamilnadu, Viral News-Latest News - Telugu

అయితే క‌ల‌క‌త్తాకు చెందిన మ‌హిల త‌న ద‌గ్గ‌ర ఎప్ప‌టి నుంచో అఘోరీగా ప‌నిచేస్తోంది, ఈయ‌న త‌న సొంత గ్రామంలో కాలికామాత విగ్ర‌హాన్ని ఏర్పాటు చేసి దానికి పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు.ఇక అప్ప‌టి నుంచి త‌న ద‌గ్గ‌ర అఘోరీ అనే మ‌హిళ శిష్య‌రికం చేస్తోంది.ఇక ఆమెను ఇష్ట‌ప‌డ్డ మ‌ణికంద‌న్ ఆమెను ఒప్పించి హిందూ సంప్రదాయం ప్రకారం పెండ్లి చేసుకున్నారు.

ఆమెకు తాళి కట్టి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.ఈయ‌న గ‌తంలో త‌న త‌ల్లి చ‌నిపోయిన‌ప్పుడు ఆత్మ‌శాంతి అంటూ ఆమె శ‌వంపై కూర్చుని పూజ‌లు చేసిన ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

#Tamilnadu #Lady Aghora #Aghora #Agora

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube