వైరల్: సరికొత్త హెయిర్ స్టైల్ తో అదరహో అనిపిస్తున్న తలైవా ధోని..!

మహేంద్ర సింగ్ థోనీ.ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లదనే చెప్పాలి.

 Viral Taliva Dhoni Looks Different With Her Latest Hairstyle-TeluguStop.com

భారత క్రికెట్ టీమ్ ను రథసారధిలాగా ముందుండి నడిపించిన కెప్టెన్ మన మహేంద్ర సింగ్ ధోని.భారత క్రికెట్ టీంలో ధోని కంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

ఇండియాను గెలిపించడంలో కెప్టెన్ థోనీ పాత్ర చాలా ఉంది.అయితే ధోని ఆట విషయంలో ఎంత కేర్ తీసుకుంటాడో అదే విధంగా తన హెయిర్ స్టైల్ విషయంలో కూడా అంతే జాగ్రత్తలు పాటిస్తారు.

 Viral Taliva Dhoni Looks Different With Her Latest Hairstyle-వైరల్: సరికొత్త హెయిర్ స్టైల్ తో అదరహో అనిపిస్తున్న తలైవా ధోని..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకప్పుడు థోనీ హెయిర్ స్టైల్ అంటే చాలామంది యువత పడి చచ్చెవారు. ధోని ఏ హెయిర్ స్టైల్ ఫాలో అయితే అదే హెయిర్ స్టైల్ ని యువత కూడా ఫాలో అయ్యేవారు.

ఒకప్పుడు థోనీ జుట్టు కొంచెం పొడవుగా పెంచుకున్నాడు.ఆ తరువాత వివిధ రకాల హెయిర్ స్టైల్స్ మార్చాడు.

మళ్ళీ ఇప్పుడు అభిమానులకు ఒక మంచి, ట్రెండీ హెయిర్ స్టైల్ ను పరిచయం చేసారు.

థోనీ తన హెయిర్ స్టైల్ ని మళ్ళీ మార్చాడు.

ఈసారి ఈ హెయిర్ లుక్ లో థోనీ కుర్రాడు లాగా కనిపిస్తున్నాడు.ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్‌ హక్కీమ్‌ ధోనికి హెయిర్ కట్ చేసి సరికొత్త హెయిర్ స్టైల్ ను అందరికి పరిచయం చేసాడు.

ప్రస్తుతం ధోని న్యూలుక్ హెయిర్ స్టైల్ ఫోటోలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.థోనీ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫోటోలను షేర్ చేశారు.

ఈ హెయిర్ స్టైల్ ను ఫంకీ హెయిర్‌ స్టైల్‌ గా పేర్కొంటారని అంటున్నరు.

ఈ థోనీ లుక్ ఇప్పుడు యూత్ ను బాగా అట్ట్రాక్ట్ చేస్తుంది.అలాగే థోనీ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.ధోని లుక్ కి అట్ట్రాక్ట్ అయిన కుర్రకారు అదే హెయిర్ స్టైల్ తమకి కావాలని కోరుకుంటున్నారు.

మళ్ళీ థోనీ ఒక సరోకొత్త ట్రెండ్ తీసుకురాబోతున్నారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.మీ హెయిర్ స్టైల్ బాగుందని ఒకరు అంటే, ఈ హెయిర్ స్టైల్ లో మీరు 25 సంవత్సరాల కుర్రాడిలాగా కనిపిస్తున్నారు అని మరొకరు అంటున్నారు.

ఆటలో అయిన ట్రెండ్ ఫాలో అవ్వడంలో అయిన థోనీ తర్వాతనే ఎవరన్నా అని కామెంట్స్ తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.

#New Hair Style #Viral #Instagram #MS.Dhoni #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు