వైర‌ల్‌.. ఆ జిల్లాలో సంచ‌ల‌నం రేపుతున్న వ‌రుస పాముకాటు మ‌ర‌ణాలు!

పామును, ప్రకృతిని పూజించే భారతీయ సంస్కృతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అయితే, పామును నాగదేవత అని పూజిస్తాం.

 Viral Snakebite Deaths Causing A Stir In That District-TeluguStop.com

కానీ, అదే పాము మన ఇంటిలోకి వస్తే చంపేస్తాం.ఎందుకంటే ప్రాణరక్షణకు.

రక్షణ అనేది ముఖ్యం కాబట్టే అలా చేస్తుంటాం.పాములు పగబడుతాయని పెద్దలు చెప్తుంటారు.

 Viral Snakebite Deaths Causing A Stir In That District-వైర‌ల్‌.. ఆ జిల్లాలో సంచ‌ల‌నం రేపుతున్న వ‌రుస పాముకాటు మ‌ర‌ణాలు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ, అది నిజం కాదని, అందులో శాస్త్రీయత లేదని వాదించే వారూ ఉన్నారు.మొత్తంగా పాము అంటే చాలు భయపడిపోయే బ్యాచ్‌ను మనం చూడొచ్చు.

కాగా, తాజాగా ఆ జిల్లాలో పాము కాట్టు ఎక్కువైపోయాయట.వరుసగా ఐదుగురిని పాములు పొట్టనబెట్టుకున్నాయి.

ఇంతకీ ఆ జిల్లా పేరెంటి? ఎంత వయస్సున్న వారు మరణించారు? అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ స్టోరీని కంప్లీట్‌గా చదవాల్సిందే.

బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాలోని వరుస పాము కాటు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

వివిధ ఘటనల్లో ఒక్కటే రోజులో ఐదుగురు మృతి చెందారు.మృతుల్లో 28, 22, 18, 14 ఏళ్ల వయస్కులు ఉండటం విషాదకరం.

ఇక పాము కాటుతో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాయి.పాము కాటుకు సమీపంలోని పీహెచ్‌సీల్లో మందులు లేకపోవడం బాధాకారం.

ఈ కారణం వల్లే మృతుల సంఖ్య పెరుగుతున్నదని తెలుస్తోంది.ఒకటే రోజులో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం యూపీ రాష్ట్రవ్యాప్తంగానూ చర్చనీయాంశంగా మారింది.

Telugu Baliya District, Five Members Died, Medicine Supply, Officers Alert, Rainy Season, Snake, Snake Bites In Up, Utharpradesh, Vhc-Latest News - Telugu

ఈ విషయమై వెంటనే అధికారులు దృష్టి సారించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ప్రస్తుతం ఉన్నది వానాకాలం కూడా కాబట్టి వర్షంలో ఒకవేళ ప్రజలు పాముకాటుకు గురైతే ఆస్పత్రికి తీసుకెళ్లడం కష్టమతరమైనని స్థానికులు చెప్తున్నారు.ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.ఆ జిల్లాతో పాటు మిగతా జిల్లాల్లోనూ పాము కాటు నుంచి రక్షణకు అవసరమయ్య మందుల సరఫరాపై చర్యలు తీసుకుంటున్నారు.

ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

#Officers Alert #Rainy Season #Snake #Utharpradesh #Medicine Supply

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు