వైరల్: ఈ బుడ్డోడికి ఇంకా భూమి మీద నూకలున్నాయి..!

ఒక్కోక్కసారి చిన్న పిల్లలు చేసే పనులు పెద్ద ముప్పును తెచ్చిపెడతాయి.అదృష్టం బాగుండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రాణాలతో బయటపడితే  సరి లేదంటే ఆ పిల్లవాడి తల్లిదండ్రులకు ఎంతటి శోకాన్ని మిగిలిస్తారో కదా.

 Viral Small Boy Uninjured Even After Bike Accident In Maharashtra-TeluguStop.com

తాజా ఒక పెద్ద ప్రమాదం నుంచి రెండు సంవత్సర చిన్న పిల్లవాడు ప్రాణాల నుంచి  బయట పడ్డాడు.ఇంటి ముందు అమ్మమ్మతో ఆడుకుంటూ ఉన్న చిన్న పిల్లవాడు అకస్మాత్తుగా రోడ్డుకు అడ్డంగా పరిగెత్తాడు.

దీనితో అదే మార్గంలో వస్తున్న ఒక ద్విచక్ర వాహనం చిన్న పిల్లవాడి మీద నుంచి వెళ్ళిపోయింది. అది గమనించి అక్కడి వారందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

 Viral Small Boy Uninjured Even After Bike Accident In Maharashtra-వైరల్: ఈ బుడ్డోడికి ఇంకా భూమి మీద నూకలున్నాయి..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.మహారాష్ట్ర మేవడ్డ్ జిల్లాలోని మదల్‌ మోహి గ్రామంలో సంఘటన చోటు చేసుకుంది.

ఆ చిన్న పిల్లవాడికి ఎటువంటి గాయాలు ఆవ్వకుండా ప్రాణాలతో క్షేమంగా బయట పడ్డాడు.ఇందుకు సంబంధించిన సంఘటన మొత్తం అక్కడే ఉండే సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో అసలు నిజం బయటపడింది.

బైక్ యొక్క రెండు టైర్లు కూడా ఆ పిల్లవాడి శరీరం మీద నుంచి వెళ్లిపోయిన అప్పటికీ ఆ పిల్లవాడికి ఎటువంటి పెద్ద గాయాలు కాకుండా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు.సంఘటన జరిగిన వెంటనే గ్రామంలోని ఆసుపత్రికి తీసుకెళ్ళిన కుటుంబ సభ్యులకు డాక్టర్లు ఆ పిల్లవాడు తీవ్రంగా గాయపడలేదని తెలపడంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు కుటుంబ సభ్యులు.

ఇలా ప్రాణాలతో బయటపడ్డ ఆ పిల్లవాడిని చూసిన వారందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు.ఏమైనా కానీ ఆ పిల్లవాడు ప్రాణాలతో సురక్షితంగా బయట పడడం చాలా అదృష్టం.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతోంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి.

#BikeDashes #Social Media #Bike Accident #Maharastra #Viral

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు